ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌ భార్య ప్రసవం | Doctor's wife delivery at government hospital | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌ భార్య ప్రసవం

Published Mon, Nov 27 2017 3:05 AM | Last Updated on Mon, Nov 27 2017 3:05 AM

Doctor's wife delivery  at government hospital - Sakshi

కాల్వ శ్రీరాంపూర్‌(పెద్దపల్లి): ప్రభుత్వ వైద్యుడి భార్య ఆదివారం ప్రభుత్వాస్పత్రిలోనే సుఖప్రసవం అయింది. పెద్దపల్లి జిల్లా మొట్లపల్లి గ్రామానికి చెందిన డాక్టర్‌ దొమ్మటి శ్రీనివాస్‌ కాల్వ శ్రీరాంపూర్‌ ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. మొదటి కాన్పు కోసం భార్య శ్రీలేఖను ఆదివారం తాను పని చేస్తున్న ఆరోగ్య కేంద్రంలోనే చేర్పించాడు.

వైద్య సిబ్బందితో కలసి ఆయనే భార్యకు కాన్పు చేయగా సుఖప్రసవమై పండంటి ఆడశిశువు జన్మించింది. తనకెంతో సంతోషంగా ఉందని వైద్యాధికారి శ్రీనివాస్‌ అన్నారు. భర్త దగ్గరుంటేనే ఆనందించే ఈ రోజుల్లో స్వయంగా ఆయనే పురుడు పోయడం మరింత ఆనందాన్ని కలిగించిందని శ్రీలేఖ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌ శ్రీనివాస్‌ తన భార్య శ్రీలేఖకు కాన్పు చేయడంపట్ల డీఎం అండ్‌ హెచ్‌వో అభినందనలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement