కలెక్టరేట్, న్యూస్‌లైన్: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ మండలస్థాయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్ నుంచి ఎంఆర్‌ఐలు, వీఆర్వోలతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేం దుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఏ మార్కెట్‌లోనైనా కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కువగా ఉంటే తడిచిపోకుం డా టార్పాలిన్‌లు కప్పాలని సూచించారు. ధాన్యా న్ని మిల్లులకు తరలించే క్రమంలో వాహనాల ఇబ్బంది ఏర్పడితే అద్దెకు తీసుకోవాలన్నారు. వాటి బిల్లులను సంబంధిత ఆర్డీఓలకు పంపించాలని వివరించారు. మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే డీఎస్‌ఓకు, ఏఎస్‌ఓకు ఫోన్‌చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, తరలింపులో ఎటువంటి సమస్యలున్నా శనివారంలోగా పరిష్కరించుకోవాలన్నారు.
11వ తేదీ వరకు ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తేవొద్దు
అల్పపీడన ప్రభావం కారణంగా ఈ నెల 11వ తేదీ వరకు ఐకేపీ కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకురావద్దని జేసీ కోరారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కొనుగోళ్లు నిలుపుదల చేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని అధికారులు, ఐకేపీ సిబ్బంది రైతులకు తెలియజేయాలని కోరారు. ఈ సెట్ కాన్ఫరెన్సులో పీడీ డీఆర్‌డీఏ సుధాకర్, డీఎం సివిల్ సప్లయిస్ వరప్రసాద్, ఏఎస్‌ఓ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు ఉన్నారు.
రైతులకు ఇబ్బంది కలిగించొద్దు
Published Sat, May 10 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement