సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కట్నం వేధింపుల కేసు | Dowry harrasments case on Software engineer | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కట్నం వేధింపుల కేసు

Published Tue, Jun 23 2015 10:17 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కట్నం వేధింపుల కేసు - Sakshi

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కట్నం వేధింపుల కేసు

అంబర్‌పేట: కట్నం వేధింపులు తాళలేక ఓ మహిళా పోలీసుకు ఫిర్యాదు చేసింది. మంగళవారం అంబర్‌పేట ఎస్‌ఐ అంజద్ తెలిపిన వివరాల ప్రకారం... డీడీ కాలనీలో నివసించే సాయి వెంకట్(31) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఇతనికి 2014లో చింతల్‌కు చెందిన సత్యనారాయణ కుమార్తె జయశ్రీతో పెళ్లైంది. కట్నకానులు కింద 50 తులాల బంగారం, 15 లక్షల నగదు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. వివాహం అనంతరం సాయి వెంకట్ ఒంటరిగా అమెరికా వెళ్లాడు.

కాపురానికి తీసుకెళ్లాల్సిందిగా అతడిని పలుమార్లు జయశ్రీ కుటుంబ సభ్యులు కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో జయశ్రీ తన సోదరుడి సహకారంతో అమెరికాలో ఉన్న వెంకట సాయి వద్దకు వెళ్లింది. అక్కడ భర్త తనను తీవ్రంగా హింసించడంతో జయశ్రీ ఇండియాకు తిరిగి వచ్చేసింది. జరిగిన విషయం అత్తమామలకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యుల సహకారంతో మంగళవారం అంబర్‌పేట పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement