
పోలీస్‌స్టేషన్‌లో దండలు మార్చుకున్న మూగ జంట
ఖమ్మం, నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని రాయగూడెం గ్రామానికి చెందిన నెమలి మనోజ్‌కుమార్‌కు మాటలు రావు. వినికిడి లోపం కూడా ఉంది. ఇతను ఖమ్మంలోని చెవిటి, మూగ పిల్లల పాఠశాలలో చదివాడు. హైదరాబాద్‌లో ఐటీఐ పూర్తి చేశాడు.అదే పాఠశాలల్లో చదువుకున్న వీఎం బంజర గ్రామానికి చెందిన జ్యోతితో పరిచయం ఏర్పడింది. ఆమె పదోతరగతి వరకు చదువుకుని ఇంటివద్దనే ఉంటోంది. ఇద్దరూ ఇష్టపడ్డారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీడియా కాల్‌లో సైగల ద్వారా సంభాషించుకునేవారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు అంగీకరించరనే అనుమానంతో గురువారం నేలకొండపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాల వారి పిలిపించి విషయం వివరించడంతో వారూ అంగీకరించారు. కుటుంబ సభ్యులు, పోలీసులు, పెద్దల సమక్షంలో దండలు మార్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment