రామకృష్ణాపూర్ : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్‌లోని ఓపెన్‌కాస్టు ప్రాంతంలో బుధవారం సాయంత్రం భూమి పగుళ్లు తేలిన ఘటన కలకలం రేపింది. ఓపెన్‌కాస్టు క్వారీకి పది మీటర్ల దూరం నుంచి గోదావరిఖని-బెల్లంపల్లి రహదారి పొడవునా పగుళ్లు తేలడం కలవరపాటుకు గురిచేసింది. మొదటి సంవత్సరం పనులు పూర్తి కావొస్తున్న సమయంలోనే ఉన్నట్టుండి భూమి పగుళ్లు తేల డం... క్వారీలోని స్లైడ్ ఫాలింగ్(మట్టి కూలిపోతుండడం) అవుతుండడంతో యావత్ అధికార గణం అప్రమత్తమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణ శివారులో గోదావరిఖని వెళ్లే రహదారిలో ఆర్‌కేపీ ఓసీపీ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ ఓసీపీ ప్రారంభం కాగా మొదటి ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు ఉత్పత్తి పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ఇప్పటికే రెండో సంవత్సరం బొగ్గు ఉత్పత్తి కోసం రెండో క్వారీ సైతం తవ్వుతున్నారు. కాగా బుధవారం సాయంత్రం రోడ్డు పొడవునా పగుళ్లు తేలాయి. క్వారీ నుంచి రోడ్డు చివరిభాగం, రోడ్డు మధ్యన, రోడ్డు ఇవతలి వైపు ఇలా మూడు చోట్ల రోడ్డు దాదాపు 400 మీటర్ల దూరం వరకు భూమి పగుళ్లు తేలింది.
బ్లాస్టింగ్ జరిగిన అనంతరం
బొగ్గు ఉత్పత్తిలో భాగంగా బుధవారం ఆర్‌కేపీ ఓపెన్‌కాస్టులో బ్లాస్టింగ్ సైతం నిర్వహించారు. మొదటి, రెండో క్వారీల్లోనూ బ్లాస్టింగ్ జరిపారు. కాగా సాయంత్రానికి భూమి క్రమక్రమంగా పగుళ్లు తేలడం కనిపించింది. గత వర్షాకాలం సమయంలో క్వారీలోని స్లైడ్ కూలిపోయింది. అంతటితో సరిపెట్టుకోకుండా కూలిపోయిన మట్టిని తీసి దాని కింద ఉన్న బొగ్గును సైతం వెలికి తీసేందుకు అధికారులు కొంత అత్సుత్సాహం చూపారని తెలుస్తోంది. సపోర్టు ఉన్న మట్టి తీయడమే కాకుండా దాని కింది బొగ్గు వెలికి తీయడంతో ఏమాత్రం సపోర్టు లేక బ్లాస్టింగ్ ధాటికి భూ పొరల్లో మార్పులు చోటు చేసుకుని ఇలా పగుళ్లు తేలి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
వాహనాల దారి మళ్లింపు
ఓసీపీ వద్ద పగుళ్లు తేలిన నేపథ్యంలో ఇప్పుడు న్న రహదారిని దారి మళ్లించారు. వాస్తవానికి ఓపెన్‌కాస్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచే ప్రత్యామ్నాయ రోడ్డు వేయాల్సి ఉంది. కానీ అధికారులు రోడ్డు నిర్మాణం పనిని పట్టిం చుకోలేదు. కాగా బుధవారం నాటి ఘట నతో మొన్నటి వరకు క్వారీ నిర్మాణంలో భాగంగా వేసిన రోడ్డు ద్వారా గురువారం నుంచి వాహనాలను అనుమతించనున్నారు. బుధవారం రాత్రి నుంచే ఈ మార్గం గుండా వాహనాలను పాత రోడ్డు ద్వారా మళ్లించారు.
పరిశీలించిన జీఎం
జీఎం మల్లిఖార్జున్‌రావు రోడ్లపై పగుళ్ల ను పరిశీలించారు. పగుళ్లు తేలటానికి కా రణాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్‌వోటూ జీఎం దేవికుమార్, ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సురేశ్‌కుమార్ ఉన్నారు.
ఆర్‌కేపీ ఓసీపీలో భూప్రకంపనలు
Published Thu, Nov 20 2014 2:52 AM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM
Advertisement
Advertisement