ramakrishnapur
-
‘అమ్మా.. అలసటగా ఉందమ్మా.. నిద్రపోతాను’
సాక్షి, రామకృష్ణాపూర్(ఆదిలాబాద్) : కష్టపడి చదివాడు..కన్నవారి కలలు నిజం చేశాడు. మామూలు వైద్యుడి కంటే ఏకంగా ‘గుండె’ డాక్టరే(కార్డియాలజిస్ట్) అయ్యాడు. కాలక్రమంలో అతనిలో ‘ప్రేమ’ అనే మరో కల మొగ్గలు తొడిగింది. చివరికి పెళ్లి దాకా వెళ్లింది. ఏ ప్రేమ కోసమైతే అతడు ఆరాటపడ్డాడో అదే ‘ప్రేమకల’ చెదిరిపోయింది. ఆ వైద్యుడి గుండె శాశ్వతంగా ఆగిపోయింది. రామకృష్ణాపూర్లో విషాదం నింపిన ఘటన వివరాలివి.. పట్టణంలోని ఠాగూర్ స్టేడియం ఏరియాకు చెందిన దాసారాపు సుభాష్(34) గురువారం రాత్రి హైదరాబాద్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రిటైర్ కార్మికుడు ఆగయ్య కుమారుడైన సుభాష్ మెడిసిన్‌కు ఎంపికయ్యాడు. అరుదైన గుండె విభాగంలో స్పెషలైజేషన్ పూర్తిచేశాడు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండే సుభాష్ హైదరాబాద్‌లో తానుంటున్న ఇంటిలోనే విషపు ఇంజక్షన్ వేసుకుని విగతజీవుడయ్యాడు. మనస్తాపంతోనే ఈ దారుణం మృతుడు సుభాష్ విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే చెన్నైకి చెందిన నిత్య అనే వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త పెళ్లి వరకు వెళ్లింది. 2017లో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. సాఫీగా వీరి దాంపత్య జీవితం గడుస్తు న్నా నిత్య తల్లిదండ్రులకు మాత్రం వీరి ప్రేమ వివా హం మింగుడు పడలేదు. 15 రోజుల క్రితం నిత్య తల్లి దండ్రులు హైదరాబాద్ వచ్చి ఆమెను చెన్నైకి తీసుకువెళ్లారు. కాగా అక్కడే మరో వ్యక్తితో పెళ్లి సంబంధం చూస్తున్నారన్న సమాచారం సుభాష్‌కు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పెళ్లై రెండు సంవత్సరాలు దాటిపోయాక మరో సంబంధం చూడటం జీర్ణించుకోలేకనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. అమ్మా.. నిద్రపోతానమ్మా.. ‘అమ్మా.. అలసటగా ఉందమ్మా.. నేను నిద్రపోతాను...’ అని చెప్పిన కొడుకు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవటం ఆ కన్నతల్లి పేగుల్ని పెకిలించివేసింది. గురువారం రాత్రి సుభాష్ నోట వచ్చిన పదాలే ఇక చివరి మాటలవుతాయని తల్లి మల్లమ్మ ఏ కోశాన ఆలోచించలేదు. ఉదయం పూట డ్యూటీకి టైం అవుతుందని లేపుదామని వెళ్లిన తల్లి కొడుకు విగతజీవుడయ్యాడని తెలిసి కుప్పకూలిపోయింది. ఎందరో పేషెంట్ల గుండెకు వైద్యం చేసిన తన కొడుకు నిజజీవితంలో ‘గుండె నిబ్బరాన్ని’ కోల్పోయాడని కన్నీరుమున్నీరైంది. ఆగయ్య–మల్లమ్మల సంతానంలో మూడోవాడైన సుభాష్ మృతి స్థానికంగా విషాదం నింపింది. శుక్రవారం ఉదయం ఈ వార్త తెలిసి ఠాగూర్‌స్టేడియం ఏరి యా వాసులు పెద్ద ఎత్తున వారింటికి తరలివచ్చారు. -
ప్రియురాలి ఫిర్యాదుతో ఆగిన ప్రియుడి పెళ్లి
గొల్లపల్లి(జగిత్యాల): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు వేరే యువతిని వివాహం చేసుకుంటున్నాడనే విషయం తెలిసి ప్రియురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడి పెళ్లిని నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో బుధవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.... కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన దీప(24)కు ఓ ఫోటో స్టూడియోలో నాలుగేళ్ల క్రితం తూర్పాటి కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచింది. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న దీపను కాదని కుమార్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. గుట్టుచప్పుడు కాకుండా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని ఇవాళ పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని కుమార్ స్నేహితుల ద్వారా తెలుసుకున్న దీప ‘తనను అన్ని విధాలుగా వాడుకొని చివరకు పెళ్లి చేసుకోకుండా.. వేరే అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడని’ గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
ఆర్కేపీ ఓసీపీలో భూప్రకంపనలు
రామకృష్ణాపూర్ : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్‌లోని ఓపెన్‌కాస్టు ప్రాంతంలో బుధవారం సాయంత్రం భూమి పగుళ్లు తేలిన ఘటన కలకలం రేపింది. ఓపెన్‌కాస్టు క్వారీకి పది మీటర్ల దూరం నుంచి గోదావరిఖని-బెల్లంపల్లి రహదారి పొడవునా పగుళ్లు తేలడం కలవరపాటుకు గురిచేసింది. మొదటి సంవత్సరం పనులు పూర్తి కావొస్తున్న సమయంలోనే ఉన్నట్టుండి భూమి పగుళ్లు తేల డం... క్వారీలోని స్లైడ్ ఫాలింగ్(మట్టి కూలిపోతుండడం) అవుతుండడంతో యావత్ అధికార గణం అప్రమత్తమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ శివారులో గోదావరిఖని వెళ్లే రహదారిలో ఆర్కేపీ ఓసీపీ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ ఓసీపీ ప్రారంభం కాగా మొదటి ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు ఉత్పత్తి పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ఇప్పటికే రెండో సంవత్సరం బొగ్గు ఉత్పత్తి కోసం రెండో క్వారీ సైతం తవ్వుతున్నారు. కాగా బుధవారం సాయంత్రం రోడ్డు పొడవునా పగుళ్లు తేలాయి. క్వారీ నుంచి రోడ్డు చివరిభాగం, రోడ్డు మధ్యన, రోడ్డు ఇవతలి వైపు ఇలా మూడు చోట్ల రోడ్డు దాదాపు 400 మీటర్ల దూరం వరకు భూమి పగుళ్లు తేలింది. బ్లాస్టింగ్ జరిగిన అనంతరం బొగ్గు ఉత్పత్తిలో భాగంగా బుధవారం ఆర్కేపీ ఓపెన్‌కాస్టులో బ్లాస్టింగ్ సైతం నిర్వహించారు. మొదటి, రెండో క్వారీల్లోనూ బ్లాస్టింగ్ జరిపారు. కాగా సాయంత్రానికి భూమి క్రమక్రమంగా పగుళ్లు తేలడం కనిపించింది. గత వర్షాకాలం సమయంలో క్వారీలోని స్లైడ్ కూలిపోయింది. అంతటితో సరిపెట్టుకోకుండా కూలిపోయిన మట్టిని తీసి దాని కింద ఉన్న బొగ్గును సైతం వెలికి తీసేందుకు అధికారులు కొంత అత్సుత్సాహం చూపారని తెలుస్తోంది. సపోర్టు ఉన్న మట్టి తీయడమే కాకుండా దాని కింది బొగ్గు వెలికి తీయడంతో ఏమాత్రం సపోర్టు లేక బ్లాస్టింగ్ ధాటికి భూ పొరల్లో మార్పులు చోటు చేసుకుని ఇలా పగుళ్లు తేలి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వాహనాల దారి మళ్లింపు ఓసీపీ వద్ద పగుళ్లు తేలిన నేపథ్యంలో ఇప్పుడు న్న రహదారిని దారి మళ్లించారు. వాస్తవానికి ఓపెన్‌కాస్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచే ప్రత్యామ్నాయ రోడ్డు వేయాల్సి ఉంది. కానీ అధికారులు రోడ్డు నిర్మాణం పనిని పట్టిం చుకోలేదు. కాగా బుధవారం నాటి ఘట నతో మొన్నటి వరకు క్వారీ నిర్మాణంలో భాగంగా వేసిన రోడ్డు ద్వారా గురువారం నుంచి వాహనాలను అనుమతించనున్నారు. బుధవారం రాత్రి నుంచే ఈ మార్గం గుండా వాహనాలను పాత రోడ్డు ద్వారా మళ్లించారు. పరిశీలించిన జీఎం జీఎం మల్లిఖార్జున్‌రావు రోడ్లపై పగుళ్ల ను పరిశీలించారు. పగుళ్లు తేలటానికి కా రణాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్వోటూ జీఎం దేవికుమార్, ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సురేశ్‌కుమార్ ఉన్నారు. -
ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడి గొడవ
ఆదిలాబాద్ : సాదారణంగా ప్రియుడి ఇంటి ముందు పెళ్లి చేసుకోమని ప్రియురాలు గొడవ చేయడం, మౌనపోరాటం చేయడం మనం వింటుంటాం, చూస్తుంటాం. ఆదిలాబాద్ జిల్లాలో సీన్ రివర్స్ అయింది. ఇక్కడ పెళ్లి చేసుకోవాలని ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు గొడవకు దిగాడు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్లో యువతీయువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి యువతి నిరాకరించింది. దాంతో ఆ యువకుడు ప్రియురాలి ఇంటి ఎదుట గొడవకు దిగాడు. తనను పెళ్లి చేసుకోవాలని తన మిత్రులతో కలిసి గొడవ చేశాడు. యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడికి దేహశుద్ధి చేసి పంపారు. -
ఫుట్‌బాల్ పోటీల్లో నల్లగొండ ఓటమి
రామకృష్ణాపూర్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్రస్థాయి సీనియర్ ఫుట్‌బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న పోటీలను పెద్దపెల్లి ఎంపీ వివేకానంద, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలీ రఫత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మార్చ్ఫాస్ట్లో వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, పూల్-ఏలో నల్లగొండ-ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగిన పోటీలో 0-5 గోల్స్‌తో నల్లగొండ ఓడిపోయింది. అలాగే ఈస్ట్ గోదావరి-మెదక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎవరూ గోల్స్ చేయకపోవడంతో డ్రాగా ముగిసింది. పూల్-బీలో విశాఖపట్నం-నిజామాబాద్ జట్లు తలపడగా 7-0 గోల్స్ తేడాతో విశాఖపట్నం గెలుపొందింది.