హైదరాబాద్:
కూకట్పల్లి జేఎన్‌టీయూలో శనివారం ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష) ఫలితాలు విడుదలయ్యాయి. కూకట్పల్లి జేఎన్టీయూలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఈ సెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం 91.87 గా నమోదయ్యింది. ఈ ఫలితాలలో బాలురే పై చేయి సాధించారు.