సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు | Effective arrangements for a trip to CM Reap | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

Published Sat, Jan 17 2015 4:11 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు - Sakshi

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

కలెక్టర్ టీకే శ్రీదేవి
 
క్లాక్‌టవర్: జిల్లాకేంద్రంలో ఈ నెల 18న సీఎం కేసీఆర్ పర్యటించనున్న ప్రాంతాలను కలెక్టర్ టీకే శ్రీదేవి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాతపాలమూరు, వీర న్నపేట, రైతు బజార్, టీడీ గుట్ట, బోయపల్లిగేట్ ప్రాంతాలను ఎస్పీ విశ్వప్రసాద్‌తో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం పర్యటన కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం మురికివాడలను సందర్శించి స్థానిక సమస్యలతో పాటు లోటుపాట్లపై ఆరా తీయనున్నారని, ఈ విషయంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందాయా లేదానని మరోసారి తనిఖీ చేసుకోవాల్సిందిగా సూచించారు. ప్రభుత్వ పథకాలకు అర్హత ఉండి అన్యాయం జరిగితే ఇప్పుడే సరిచేయాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం మురికివాడల ప్రజలతోనే ముఖాముఖి నిర్వహించనున్నారని, ఆప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులేకుండా చూడాలన్నారు.

వాడవాడలో పకడ్బందీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాల్సిందిగా ఎస్పీకి సూచించారు. అనంతరం మురికివాడలో ఉంటున్న ప్రజలు కలెక్టర్ మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ హన్మంత్ రెడ్డి, డీఎస్పీ కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement