కోడి పెట్టిన గుడ్డేనా?
కోడి పెట్టిన గుడ్డేనా?
Published Thu, Jun 8 2017 4:18 AM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
సాగుతున్న పెంకు.. కాలిస్తే ప్లాస్టిక్ వాసన
కరీమాబాద్(వరంగల్ తూర్పు): వరంగల్‌లోని కరీమాబాద్‌లో అంగన్‌వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన కోడి గుడ్లు కృత్రిమమైనవిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఏడాది వయస్సున్న తన కొడుకు రుత్వేజ్ కోసం స్థానికు రాలు బండి స్వరూప కాశికుంటలోని అంగన్‌వాడీ కేం ద్రం నుంచి కోడిగుడ్లు తీసుకొచ్చింది. బుధవారం కోడిగుడ్లను ఉడకబెట్టి పెంకు తీస్తుండగా కింది పొర ప్లాస్టిక్‌లా సాగడం, పసుపు రంగు ఓ రకమైన వాసన వచ్చిందని చెప్పారు. కోడిగుడ్డుపై తెల్లని పొరను కాల్చగా ప్లాస్టిక్‌లా ముడుచుకుపోయిందన్నారు. దీనిపై అంగన్ వాడీ సూపర్ వైజర్‌ని అడగ్గా ఈ విషయమై పరిశీలిస్తానని చెప్పారు.
గాంధారిలో: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమారం తండాలోని అంగన్‌వాడీ కేంద్రానికి సరఫరా చేసిన గుడ్లు ప్లాస్టిక్‌లా ఉన్నాయని స్థానికులు ఆరోపిం చారు. గుడ్లను ఉడికిస్తే ప్లాస్టిక్‌లా ముద్దగా అవుతున్నా యని చెప్పారు. స్థానికుల ఫిర్యాదుతో ఐసీడీఎస్ అధికా రులు బుధవారం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
Advertisement