సిరాచుక్కా చెరిగీపోదులే! | Elections Ink Mark Bottles Supply From Hyderabad | Sakshi
Sakshi News home page

సిరాచుక్కా చెరిగీపోదులే!

Published Fri, Mar 15 2019 12:14 PM | Last Updated on Fri, Mar 15 2019 12:14 PM

Elections Ink Mark Bottles Supply From Hyderabad - Sakshi

ఒక్క సిరాచుక్క దేశ ప్రగతికి దిక్సూచి అన్నట్లుగా.. ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల సమయంలో కీలక భూమిక పోషించడమే కాదు.. అందరికీ సుపరిచితమైన సిరాచుక్క తయారీకి గ్రేటర్‌ నగరం చిరునామాగా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 దేశాలతో పాటు, మన దేశంలోని 29 రాష్ట్రాలకు సైతం గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచే ఎన్నికల క్రతువులోవినియోగించే సిరాచుక్క ఎగుమతి అవుతుండటం విశేషం. నగరం కేంద్రంగా సుమారు మూడు దశాబ్దాలుగా దీనినినిర్విఘ్నంగా నిర్వహిస్తోంది రాయుడు ల్యాబరేటరీస్‌ సంస్థ.ఆ వివరాలేమిటో ఒకసారి చూద్దాం.

సాక్షి, సిటీబ్యూరో : మనం ఓటు వేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం సిరాచుక్క. మన దేశంతో పాటు చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన తర్వాత వేలికి సిరాచుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలిపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్‌ అధికారిపై ఉంటుంది. ఒక వేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలికైనా సిరాచుక్క పెట్టాలి. ఎన్నిల వేళ కీలకంగా మారే ఈ సిరా గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలోనే తయారవుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల ఎన్నికల్లో ఈ సిరానే వాడుతున్నారు.

ఇక్కడి నుంచే ఎగుమతి.. 
భారత్‌లో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే ఎన్నికల సిరాను తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌ (ఎంపీవీఎల్‌) ఒకటి కాగా.. హైదరాబాద్‌ ఉప్పల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలోని రాయుడు ల్యాబరేటరీస్‌ మరొకటని దీని  సీఈఓ శశాంక్‌ రాయుడు తెలిపారు. 37 ఏళ్లుగా ఇంక్‌ను తయారు చేస్తున్నామని చెప్పారు.  

పల్స్‌ పోలియో కార్యక్రమంలోనూ..  
ఎన్నికల్లోనే కాకుండా పల్స్‌ పోలియో కార్యక్రమంలో కూడా సిరాను వాడుతుంటారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు గుర్తించేందుకు వారి వేలిపై సిరా చుక్క పెడుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌ఓ) కూడా ఇండెలిబుల్‌ ఇంక్‌ కోసం రాయుడు ల్యాబరేటరీస్‌ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో ఏ దేశంలో పల్స్‌ పోలియో కార్యక్రమం జరిగినా అక్కడ ఈ సిరానే ఉపయోగిస్తుండడం విశేషం.  

అంత ఈజీగా చెరిగిపోదు..
ఎన్నికల్లో వాడే సిరాను సెమీ పర్మనెంట్‌ ఇంక్‌గా చెప్పవచ్చు. ఈ సిరాలో కొన్ని రకాల రసాయనాలతో పాటు 10 నుంచి 18 శాతం వరకు సిల్వర్‌ నైట్రేట్‌ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే గట్టిగా మారుతుంది. వేలిపై పెట్టిన తర్వాత మూడు నుంచి ఏడు రోజుల పాటు చెరిగిపోకుండా ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement