ink marks
-
బ్యాలెట్‌పై ముందే సిరా గుర్తు!
రాజేంద్రనగర్: బ్యాలెట్ పేపర్లో ఓ అభ్యర్థి గుర్తుపై ముందే సిరాగుర్తు ఉండటంతో వివాదాస్పదమైంది. బుధవారం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. మున్సిపల్ పరిధి 20వ డివిజన్‌కు చెందిన ఐశ్వర్య తొలిసారి ఓటు వేసేందుకు కుటుంబీకులతో కలిసి బండ్లగూడ సరస్వతీ విద్యాలయంలోని పోలింగ్ బూత్‌కు వచ్చింది. దీంతో అధికారులు ఆమెకు బ్యాలెట్ పేపర్‌ను ఇచ్చారు. బ్యాలెట్‌పై అప్పటికే కారు గుర్తుపై సిరాతో ముద్ర వేసి ఉంది. దీంతో ఐశ్వర్య అభ్యంతరం వ్యక్తం చేసి ప్రిసైడింగ్ అధికారికి విషయం తెలిపి మరో బ్యాలెట్ పేపర్ కావాలని చెప్పాడు. ఓ వృద్ధుడు పొరపాటున బ్యాలెట్ పేపర్‌పై వేలి ముద్ర వేశాడని సముదాయించి అదే బ్యాలెట్ పేపర్‌తో ఓటు వేయించారు. ఐశ్వర్య మాత్రం తనకు అన్యాయం జరిగిందని, తన ఓటు చెల్లకుండా పోయిందని ఆరోపిస్తూ అదే సమయంలో అక్కడికి వచ్చిన జిల్లా ఎన్నికల అబ్జర్వర్ నాయక్, బండ్లగూడ ఆర్వో కృష్ణమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. అధికారులు ఆమెను సముదాయించి లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. వేసిన ఓటు తప్పకుండా చెల్లుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ముందే ఓటేశారు.. బ్యాలెట్ పేపర్లలోని కారు గుర్తుపై ముందే సిరా గుర్తుతో ఓటు వేశారని 20వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అభిలాష్ ముదిరాజ్ ఆరోపించారు. తాను మొదటి నుంచే బ్యాలెట్ పేపర్లను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని, పోలీసులు తనను పోలింగ్ బూత్ వద్దకు రానివ్వలేదని మండిపడ్డారు. బ్యాలెట్ పేపర్లలోని కారు గుర్తుపై మందే సిరా ముద్రలు ఉన్నాయని చాలామంది తనకు ఫిర్యాదు చేశారని అభిలాష్ తెలిపారు. ఓడిపోతామనే భయంతో పోలీసులు, పొలింగ్ సిబ్బందితో టీఆర్ఎస్ నేతలు కుమ్మక్కై ఇలా చేశారన్నారు. ఐశ్వర్య ఫిర్యాదు తన ఆరోపణలకు బలం చేకూరిందని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
సిరాచుక్కా చెరిగీపోదులే!
ఒక్క సిరాచుక్క దేశ ప్రగతికి దిక్సూచి అన్నట్లుగా.. ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల సమయంలో కీలక భూమిక పోషించడమే కాదు.. అందరికీ సుపరిచితమైన సిరాచుక్క తయారీకి గ్రేటర్ నగరం చిరునామాగా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 దేశాలతో పాటు, మన దేశంలోని 29 రాష్ట్రాలకు సైతం గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఎన్నికల క్రతువులోవినియోగించే సిరాచుక్క ఎగుమతి అవుతుండటం విశేషం. నగరం కేంద్రంగా సుమారు మూడు దశాబ్దాలుగా దీనినినిర్విఘ్నంగా నిర్వహిస్తోంది రాయుడు ల్యాబరేటరీస్ సంస్థ.ఆ వివరాలేమిటో ఒకసారి చూద్దాం. సాక్షి, సిటీబ్యూరో : మనం ఓటు వేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం సిరాచుక్క. మన దేశంతో పాటు చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన తర్వాత వేలికి సిరాచుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలిపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒక వేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలికైనా సిరాచుక్క పెట్టాలి. ఎన్నిల వేళ కీలకంగా మారే ఈ సిరా గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలోనే తయారవుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల ఎన్నికల్లో ఈ సిరానే వాడుతున్నారు. ఇక్కడి నుంచే ఎగుమతి.. భారత్‌లో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే ఎన్నికల సిరాను తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (ఎంపీవీఎల్) ఒకటి కాగా.. హైదరాబాద్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని రాయుడు ల్యాబరేటరీస్ మరొకటని దీని సీఈఓ శశాంక్ రాయుడు తెలిపారు. 37 ఏళ్లుగా ఇంక్‌ను తయారు చేస్తున్నామని చెప్పారు. పల్స్ పోలియో కార్యక్రమంలోనూ.. ఎన్నికల్లోనే కాకుండా పల్స్ పోలియో కార్యక్రమంలో కూడా సిరాను వాడుతుంటారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు గుర్తించేందుకు వారి వేలిపై సిరా చుక్క పెడుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్ఓ) కూడా ఇండెలిబుల్ ఇంక్ కోసం రాయుడు ల్యాబరేటరీస్ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో ఏ దేశంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగినా అక్కడ ఈ సిరానే ఉపయోగిస్తుండడం విశేషం. అంత ఈజీగా చెరిగిపోదు.. ఎన్నికల్లో వాడే సిరాను సెమీ పర్మనెంట్ ఇంక్గా చెప్పవచ్చు. ఈ సిరాలో కొన్ని రకాల రసాయనాలతో పాటు 10 నుంచి 18 శాతం వరకు సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే గట్టిగా మారుతుంది. వేలిపై పెట్టిన తర్వాత మూడు నుంచి ఏడు రోజుల పాటు చెరిగిపోకుండా ఉంటుంది. -
అడగండి చెబుతా.. ఈసీ సమాధానాలు
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితా లో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి. - ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్, లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి. ప్ర. తిరుపతి నియోజకవర్గ ఓటరుగా నాకు 2008లో జారీచేసిన ఐడీ కార్డు ఉంది. మూడేళ్ల నుంచి రాజమండ్రిలో ఉంటున్నా. రాజమండ్రిలో ఓటరుగా దరఖాస్తు చేసుకున్నా. ఇంతవరకూ కొత్త ఓటర్ ఐడీ కార్డు రాలేదు. ఇప్పుడు నేను పాత కార్డుతో రాజమండ్రిలో ఓటు వేయవచ్చా? - రవిశంకర్ జ.మీ పాత ఓటర్ ఐడీ కార్డు చెల్లదు. ఏప్రిల్ 19 నాటికి మీ పేరు రాజమండ్రి ఓటర్ల జాబితాలో చేరుతుంది. ఆ మేరకు మీరు రాజమండ్రిలో ఓటు వేయవచ్చు. ప్ర. ఎన్నికల సమయంలో ‘ప్రెస్’ అని రాసి ఉన్న వాహనాల్లో కూడా డబ్బు తదితరాలను తరలించే అవకాశం ఉంది. ‘ప్రెస్’ వాహనాలకు కూడా ఎన్నికల సంఘం ప్రత్యేక పాస్ ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా? - సాయి శరత్, విశాఖపట్నం జ.ఎన్నికల సంఘం ఇచ్చే పాస్‌తో నడిచే వాహనాల్లో డబ్బు తరలించరన్న గ్యారెంటీ ఉంటుం దా.. కాబట్టి ప్రెస్ వాహనాలతో సహా అన్ని వాహనాలనూ తనిఖీ చేస్తాం. ప్ర. పోలింగ్ రోజున పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారా? - రాధిక, మిర్యాలగూడ జ. వారు కూడా అందరిలాగే క్యూలో వచ్చి ఓటు వేయాలి. వికలాంగులు, వృద్ధులు, పసిపిల్లల తల్లులకే నేరుగా వచ్చే అవకాశముంది. -
అడగండి చెబుతా.. ఈసీ సమాధానాలు
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితా లో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి. - ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్, లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి. మాది కర్నూలులోని ప్రకాశ్‌నగర్. మా ఇంటి నంబరు 44-86-4. ప్రస్తుతం ఓటర్ల జాబితాలో నాపేరు, మా అమ్మగారి పేరు తొలగించారు. మా అమ్మాయి, నాన్న పేర్లు మాత్రం ఉన్నాయి. మా అడ్రస్‌తో నాలుగు కొత్తపేర్లు (ముగ్గురు ము స్లింలు, ఒక హిందువు) జాబితాలో ఉన్నాయి. బూత్ లెవల్ ఆఫీసర్లకు (బీఎల్వో) తెలియకుండా జాబితాలో ఇటువంటి అవకతవకలు చోటుచేసుకునే అవకాశం లేదు. జాబితాలో ఇలాంటి అవకతవకలు కర్నూలులో చాలా ఉన్నాయి. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. - కొత్తూరు సత్యనారాయణగుప్తా బీఎల్వోపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. కర్నూలు కలెక్టరుకు ఆదేశాలిస్తాం. నాది నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం ఉల్పైపాలెం గ్రామం. ఆరేళ్ల క్రితం కూలి పనులకు హైదరాబాద్ వలస వెళ్లాను. గ్రామంలో లేనన్న కారణంతో నా ఓటు తీసేశారు. గ్రామంలో లేని కొందరి పేర్లు మాత్రం జాబితాలో ఉన్నాయి. ఉదాహరణకు.. హెచ్డీఆర్ 3077039-షద్రక్ బోజ, హెచ్డీఆర్ 3077047-నాగమణి, హెచ్డీఆర్3078326-గుండె రవి. వీరు గ్రామంలో లేకున్నా జాబితాలో పేర్లు ఉన్నాయి. గ్రామ నాయకుల కనుసన్నల్లోని బీఎల్వోలు అవకతవకల జాబితా తయారు చేస్తున్నారు. దీనిపై మీరేం చర్యలు తీసుకుంటారు? - నరేష్ మీ ఫిర్యాదును పరిశీలిస్తాం. బాధ్యుడైన బీఎల్వోపై చర్యలు తీసుకుంటాం. -
అడగండి చెబుతా.. ఈసీ సమాధానాలు
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి. - ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్, లేదా election@sakshi.comకు మెయిల్చెయ్యండి. ఎస్ఐ పోస్టుల ఎంపిక జాబితా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఎన్నికల సంఘం అనుమతి కావాలని ఆపారు. ఫలితాల కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకుని ఫలితాల వెల్లడికి ఆదేశాలు ఇవ్వగలరు. - ఆర్.విజయ్‌కుమార్ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఈ అంశం గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాం. ప్రస్తుతం ఈ విషయం వారి పరిశీలనలో ఉంది. మేం విజయవాడ 55వ వార్డులో ఉంటున్నాం. మా ఏరియా అజిత్‌సింగ్‌నగర్ అయితే ఓటర్ ఐడీకార్డులో కనక దుర్గానగర్ అని ప్రింట్ అయ్యింది. మా ఓట్లు 52వ వార్డుకు వెళ్లాయి. దీంతో వార్డే కాకుండా నియోజకవర్గమూ మారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? - పలపర్తి శేషయ్య మీరు నివాసం ఉంటున్న చోట మీ ఓట్లు లేకపోతే ఏప్రిల్ 9లోపు కొత్త దరఖాస్తు ఇచ్చి జాబితాలో మీ పేర్లు చేర్పించుకోవచ్చు. నేను పూణెలో ఉంటున్నాను. ఈ ఎన్నికల్లో నేను రాష్ట్రంలో ఓటు వేయాలంటే ఏం చేయాలి? - రాం్రపసాద్ మీరు ఏ ఊరిలో ఓటు వేయాలనుకుంటే ఆ ఊరిలోనే నివాసం ఉండాలి. పూణెలో నివాసం ఉంటూ ఇక్కడ ఓటు వేయడం కుదరదు. మీరు పూణెలోనే ఓటరుగా నమోదు చేయించుకోని అక్కడే ఓటు వేయాలి. -
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి - ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్, లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి. మాది ప్రకాశం జిల్లా, జే.పంగులూరు మండలం రామకూర్ గ్రామం. నేను ఓటరు ఐడీ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు రాలేదు. స్థానిక బీఎల్వోను సంప్రదిస్తే స్పందన లేదు. వెరిఫికేషన్ సమయంలో ఇంటివద్ద ఉండాలంటున్నారు. నేను నూజివీడు త్రిబుల్‌ఐటీలో చదువుతున్నాను. ధ్రువీకరణ పత్రాలన్నీ నా తల్లిదండ్రులు చూపారు. ఆన్లైన్లో ఆధార్ చూపించాను. అయినా ఓటరు కార్డు రాలేదు. - ఎం.నాగూర్ మస్తాన్ వలీ మీ పేరు ఓటర్ల జాబితాలో చేర్చేందుకు జిల్లా కలెక్టరుకు సిఫారసు చేస్తున్నాం. విద్యార్థులు స్థానికంగా లేకపోయినా వారి స్వగ్రామంలో ఓటుహక్కు కల్పించేలా ఎన్నికల సంఘం నిర్ణయించింది. మీ ధ్రువీకరణ పత్రాలను మీ తల్లిదండ్రులు ఎన్నికల సిబ్బందికి చూపితే ఓటర్ల జాబితాలో పేరు చేరుతుంది. మా కోడలు అంజుమ్ ఆరా పేరు షేర్లింగంపల్లి నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చేర్పించేందుకు జనవరి 1 కన్నా ముందే దరఖాస్తు చేశాను. నా కోడలు తాను పేర్కొన్న అడ్రస్‌లో ఉండట్లేదని తిరస్కరించారు. దయచేసి మా కోడలు పేరు షేర్లింగంపల్లి ఓటర్ల జాబితాలో చేర్పించగలరు. - అనజీర్ అహ్మద్ ceoandhrapradesh@eci.gov.in కు మీ పూర్తి వివరాలు తెలుపుతూ మెయిల్ చేయండి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. నవ తెలంగాణ నిర్మాణంలో భాగం కండి నవ తెలంగాణ సామాజికంగా, ఆర్థికంగా, రాజ కీయంగా, సాంస్కృతికంగా మరింతగా వెలుగులీనా లంటే ఎలాంటి మేలిమి మార్పులు రావాలి? అందు కోసం ఏమేం చేయాలి? ఎవరెవరు ఎలా నడుం బిగించాలి? వీటిపై మీ అభిప్రా యాలు ‘సాక్షి’తో పంచు కోండి. ఎలక్షన్ సెల్, సాక్షి దినపత్రిక, రోడ్ నం.1 బంజారాహిల్స్, హైదరాబాద్ లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి.