అడగండి చెబుతా.. ఈసీ సమాధానాలు
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు
ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితా లో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి. - ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్, లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి.
మాది కర్నూలులోని ప్రకాశ్‌నగర్. మా ఇంటి నంబరు 44-86-4. ప్రస్తుతం ఓటర్ల జాబితాలో నాపేరు, మా అమ్మగారి పేరు తొలగించారు. మా అమ్మాయి, నాన్న పేర్లు మాత్రం ఉన్నాయి. మా అడ్రస్‌తో నాలుగు కొత్తపేర్లు (ముగ్గురు ము స్లింలు, ఒక హిందువు) జాబితాలో ఉన్నాయి. బూత్ లెవల్ ఆఫీసర్లకు (బీఎల్‌వో) తెలియకుండా జాబితాలో ఇటువంటి అవకతవకలు చోటుచేసుకునే అవకాశం లేదు. జాబితాలో ఇలాంటి అవకతవకలు కర్నూలులో చాలా ఉన్నాయి. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.
- కొత్తూరు సత్యనారాయణగుప్తా
బీఎల్‌వోపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. కర్నూలు కలెక్టరుకు ఆదేశాలిస్తాం. నాది నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం ఉల్పైపాలెం గ్రామం. ఆరేళ్ల క్రితం కూలి పనులకు హైదరాబాద్ వలస వెళ్లాను. గ్రామంలో లేనన్న కారణంతో నా ఓటు తీసేశారు. గ్రామంలో లేని కొందరి పేర్లు మాత్రం జాబితాలో ఉన్నాయి. ఉదాహరణకు.. హెచ్‌డీఆర్ 3077039-షద్రక్ బోజ, హెచ్‌డీఆర్ 3077047-నాగమణి, హెచ్‌డీఆర్3078326-గుండె రవి. వీరు గ్రామంలో లేకున్నా జాబితాలో పేర్లు ఉన్నాయి. గ్రామ నాయకుల కనుసన్నల్లోని బీఎల్‌వోలు అవకతవకల జాబితా తయారు చేస్తున్నారు. దీనిపై మీరేం చర్యలు తీసుకుంటారు? - నరేష్
మీ ఫిర్యాదును పరిశీలిస్తాం. బాధ్యుడైన బీఎల్‌వోపై చర్యలు తీసుకుంటాం.