ఎన్టీపీసీలో అధికారుల ఆందోళన | employees gave a request form to director in NTPC | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీలో అధికారుల ఆందోళన

Published Tue, Mar 31 2015 10:49 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

employees gave a request form to director in NTPC

జ్యోతినగర్ (రామగుండం): కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రంలో అధికారులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అధికారి రవినందన్‌రాయ్ వైద్య సేవలు సరిగా అందకపోవడం వల్లే మృతి చెందాడని ఆరోపించారు.

కొద్దిసేపు ప్లాంట్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే శ్రీవాస్తవను కలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్లాంట్ ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీపీసీ అధికారుల సంఘం అధ్యక్షుడు జి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీవాస్తవకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement