జిల్లాలో వలసల నివారణకు స్వస్తి చెప్పి ఉన్న చోటే ఉపాధి పనులు చేయడానికి కూలీలు సిద్ధపడుతున్నారు.
మహబూబ్‌నగర్ వ్యవసాయం,న్యూస్‌లైన్ : జిల్లాలో వలసల నివారణకు స్వ స్తి చెప్పి ఉన్న చోటే ఉపాధి పనులు చే యడానికి కూలీలు సిద్ధపడుతున్నారు. జిల్లాలో ఉపాధి హామీ పనులను సంబంధిత అధికారి పకడ్బందీగా అమ లు చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో సిబ్బంది హడలెత్తిపోతున్నారు. ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో డ్వామా పీడీగా హరిత బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆమె వలసల నివారణకు పలు చర్యలు తీసుకున్నారు. ఉపాధి పనుల్లో పురోగతి సా ధించారు.
గ్రామాల్లో పనిచేసే సిబ్బంది కి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీలు చేశారు. దాంతో సి బ్బంది హడలెత్తిపోయారు. అక్కడే సి బ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ నెలకొన్న సమస్యలపై చర్చిస్తూ ఆ సమస్యలను పరిష్కారించడానికి కృ షి చేస్తున్నారు. విధుల నిర్వహణలో ఏ మాత్రం పొరపాటు చేసినా వెంటనే మె మోలు జారీ చేస్తున్నారు. దీంతో పను లు సక్రమంగా జరిగేలా చూస్తున్నారు.
పనుల్లో పురోగతి ఇలా..
జిల్లాలో గతేడాది కంటే ఉపాధి పనుల్లో పురోగతి పెరిగింది. గతేడాది ఫిబ్రవరిలో 3.18 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించారు. ఎన్నికల విధుల్లో ఉన్న కూడా ఈ ఏడాది మార్చిలో ఇప్పటి వరకు 10.15 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించారు. ఎప్పుడు రానంతగా వారం క్రితం ఒకే రోజు 90 వేల మందికి పైగా కూలీలు రికార్డు స్థాయిలో పనులకు హాజరయ్యారు.
జిల్లా నుంచి వలసలు వెళ్లే వారిని గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తూ వలసల నివారణకు కృషి చేస్తున్నారు. వలసలను నివారించేందుకు పకడ్బందీగా పనిచేయాలని డ్వామా వలసల నివారణ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. అంతేకాకుండా ఐహెచ్‌హెచ్‌ఎల్ పథకం ద్వారా నిర్మించే మరుగుదొడ్ల నిర్మాణం, పండ్ల తోటల పెంపకం, ఇందిరజలప్రభ, ఐడ బ్ల్యూఎంపీ పథకాలలో పురోగతి సాధించారు.
పెండింగ్ బిల్లుల చెల్లింపు
పీడీగా భాద్యతలు చేపట్టే సమయానికి కూలీలకు చెల్లించాల్సిన రూ. కోటి 10 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో రూ. 79 లక్షలను చెల్లించారు. ఇంకా మిగిలిన రూ. 31 లక్షల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఉపాధి పనిచేసిన ప్రతి కూలీకి 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలని సిబ్బందిని ఆదేశించారు.
వరుసగా సమీక్షలు
ఈమె పీడీగా భాద్యతలు చేపట్టినప్పటి నుంచి వారంలో ఒకటి, రెండు సార్లు మండల్లాలో పనిచేసే సిబ్బందితో వీడిమో కాన్ఫ్‌రెన్స్‌లో పనుల పురోగతిపై చర్చిస్తారు. జిలాల్లో ప్రతిరోజు ఒక ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడ నెలకొన్న సమస్యలను అక్కడే పరిష్కారానికి కృషి చేస్తారు. దేవరకద్ర నియోజకవర్గ ఎన్నికల అధికారిగా కొనసాగుతూనే ఉపాధి పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తున్నారు.