జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాది కూలీలందరికి మార్చి నెలాఖరు నాటికి పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి అధికారులను ఆదేశించారు.
మహబూబ్‌నగర్ (టౌన్): జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాది కూలీలందరికి మార్చి నెలాఖరు నాటికి పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పనిచేస్తామని ముందుకు వచ్చే ప్రతి కూలీకి పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
క్షేత్రస్థాయిలో పని కల్పించని వారిని సహించేది లేదని వారిపై కఠిన చర్యలు తప్పవంటూ కలెక్టర్ హెచ్చరించారు. ఇక కూలీలకు పని కల్పించే విషయంలో ముందస్తు ప్రణాళికల్ని రూపొందించుకొని సాధ్యమైననీ ఎక్కువ రోజులు పని కల్పించాల్సిందిగా వారికి సూచించారు. ఇంత వరకు పనులు చేపట్టేందుకు గుర్తించిన వాటిలో తక్షణమే పనులు ప్రారంభించాలని, ఈవిషయంలో కూలీలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.