ముగిసిన రేషనలైజేషన్ | Ended Resanalaijesan | Sakshi
Sakshi News home page

ముగిసిన రేషనలైజేషన్

Published Wed, Jul 1 2015 11:55 PM | Last Updated on Sat, Mar 9 2019 4:19 PM

Ended Resanalaijesan

జిల్లా పరిషత్ పాఠశాలల్లో మిగులు పోస్టులను గుర్తించిన విద్యాశాఖ వాటిని సర్దుబాటు చేసేందుకు నానాపాట్లు పడాల్సి వచ్చింది.
 సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం కావడంతో బదిలీల షెడ్యూల్‌లోనే మార్పులు చేయాల్సి వచ్చింది. విద్యాశాఖ డెరైక్టర్ నుంచి రోజుకో జీఓ జారీ కావడం...దానికి అనుసరించి మార్పులు చేర్పులు చేయడంలో విద్యాశాఖ రేయింబవళ్లు శ్రమించింది. బుధవారం ఉపాధ్యాయ తుదిఖాళీల జాబితాను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ప్రవేశపెట్టింది. అలాగే బదిలీల కోసం ఉపాధ్యాయుల దరఖా స్తు కూడా ముగిసింది. 19 మంది విద్యార్థుల లోపు ఉన్న పాఠశాలలకు ఒక టీచరు, 20 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఇద్దరు టీచర్లు చొప్పున కేటగిరీల వారీగా మిగులు పోస్టులను సర్దుబాటు చేశారు. ఈ విధంగా సర్ధుబాటు చేయగా ఇంకా మిగిలిన పోస్టులను డీఈఓ వద్దనే ఉంచారు. ప్రభుత్వం భవిష్యత్తులో డీఎస్సీ ద్వారా లేదా కొత్త పోస్టులు మంజూరు చేసినప్పుడు వీటిని వాడుకుంటారు.
 
 బుధవారం రాత్రి 10 గంటల సమయం వరకు విద్యాశాఖ అందించిన సమాచారం మేరకు వివరాలు....జిల్లా పరిషత్ యాజమాన్య కోటాలో జిల్లా ప్రాథమిక పాఠశాలలు 2179 ఉన్నాయి. ఈ పాఠశాలలకు ప్రభుత్వం 5,838 పోస్టులను మంజూరు చేసింది. రేషనలైజేషన్ జీఓ నెం.11, 17 ప్రకారం  కా వాల్సిన పోస్టులు 4,765 మాత్రమే. ఇవి గాక 1073 పోస్టులు మిగులుతున్నాయి. దీంట్లో 436 పోస్టులను కదిలించకుండా అక్కడే ఉంచారు. మిగులు పోస్టుల నుంచి కదలించకుండా ఉన్న పోస్టులను తీసేయగా 637 ఎస్‌జీటీ పోస్టులు మిగిలాయి. వీటిని డీఈఓ వద్దనే ఉంచారు. జెడ్పీ కోటా కిందనే ఉర్దూ విభాగంలో జిల్లాలో 19 పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో 41 పోస్టులు మంజూరు కాగా 30 పోస్టులు అవసరం ఉంది. ఈ పోస్టులను సర్దుబాటు చేయగా 11 పోస్టులు మిగులుతున్నాయి. దీంట్లో 5 పోస్టులను కదలించకుండా అక్కడే ఉంచడం ద్వారా 5 పోస్టులు మిగిలాయి.
 
 ఉర్దూ మీడియంలో..
 ప్రభుత్వ మేనేజ్‌మెంట్ కింద ఉర్దూ మీడియంలో జిల్లాలో 14 పాఠశాలలు ఉన్నాయి. 38 పోస్టులను మంజూరు చేయగా రేషనలైజేషన్ జీఓ ప్రకారం 24 పోస్టులు సరిపోతున్నాయి. ఈ పోస్టులను మినహాయిస్తే 14 పోస్టులు మిగులుతున్నాయి. దీంట్లో 7 పోస్టులు కదిలించకుండా అక్కడే ఉంచడం ద్వారా మరో 7 పోస్టులు డీఈఓ వద్దనే ఉంచారు.
 
 తెలుగు మీడియంలో..
 ప్రభుత్వ మేనేజ్‌మెంట్ కింద తె లుగు మీడియంలో జిల్లాలో 77 పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో 225 ఎస్‌జీటీ పోస్టులు మంజూరు చేశారు. కానీ రేషనలైజేషన్ జీఓ ప్రకారం 167 పోస్టులు సరిపోతున్నాయి. 58 పోస్టులు మిగులుతున్నాయి. దీంట్లో 17 పోస్టులు కదిలించలేదు. ఈ పోస్టుల్లోంచి మిగులు పోస్టులను తీసేయగా 41 పోస్టులు డీఈఓ వద్దనే ఉంచారు. స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల వివరాలు ఇంకా అందాల్సి ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement