►ఇంజనీరింగ్‌లో 8 మందికి మార్కులు సున్నా
►మెడిసిన్‌లో ఏడుగురికి కూడా..
►ముగ్గురికి మెడిసిన్‌లో 159 చొప్పున మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రాసిన విద్యార్థుల్లో ఇంజనీరింగ్‌లో 8 మందికి ఒక్క మార్కు రాకపోగా సున్నాకే పరిమితం అయ్యారు. అలాగే అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ఏడుగురు అభ్యర్థులకు కూడా ఒక్కమార్కూ రాలేదు. ఇందులో పది లోపు మార్కులకే పరిమితమైన వారు మరో ముగ్గురు ఉండగా, ఇంజినీరింగ్‌లో సున్నా మార్కుల వచ్చిన వారిని మినహాయిస్తే.. పదిలోపు మార్కుకే పరిమితమైన వారు 10 మంది ఉన్నారు. ఇక అత్యధికంగా అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 160 మార్కులకు 159 సాధించిన వారు ముగ్గురు ఉన్నారు. ఇంజనీరింగ్‌లో 160 మార్కులకు 158 మార్కులు సాధించింది ఒక్కరే.
ఎంసెట్ ఫలితాల్లో విచిత్రాలు
Published Tue, Jun 10 2014 3:02 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement