ఒకరి పరీక్ష మరొకరు రాస్తూ పట్టుబడ్డారు | Engineering students to arrest for exam instead of one | Sakshi
Sakshi News home page

ఒకరి పరీక్ష మరొకరు రాస్తూ పట్టుబడ్డారు

Published Wed, Jun 17 2015 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

ఒకరి పరీక్ష మరొకరు రాస్తూ పట్టుబడ్డారు

ఒకరి పరీక్ష మరొకరు రాస్తూ పట్టుబడ్డారు

హైదరాబాద్: ఒకరికి బదులుగా మరొకరు ఇంజనీరింగ్ పరీక్ష రాసిన ఘటనలో ఇద్దరు యువకులను చాంద్రాయణగుట్ట పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....చాంద్రాయణగుట్ట బండ్లగూడలోని అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం బి.నితిన్ రావు అనే విద్యార్థి బీటెక్ మొదటి సంవత్సరానికి సంబంధించిన విద్యార్థి మొదటి సంవత్సరం గణిత శాస్త్రం పరీక్ష సప్లమెంటరీ రాయాల్సి ఉంది.

కాని నితిన్ రావు స్థానంలో బీటెక్ పూర్తి చేసిన అతని స్నేహితుడు సి.హెచ్. నరేష్ పరీక్ష రాస్తున్నాడు. ఇది గమనించిన పరీక్ష ఇన్విజిరేటర్ కె.నరేష్ విషయాన్ని గమనించి కళాశాల డిప్యూటీ డెరైక్టర్ చేపూరి శ్రీలత దష్టికి తీసుకెళ్లాడు. ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాస్తుండడాన్ని గుర్తించిన ఆమె చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు విద్యార్థులు మేజర్‌గా ఉండడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు నితిన్, నరేష్‌లను అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement