
'ఆయన భాషను అసహ్యించుకుంటున్నారు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో లఫంగి, లుచ్చా పనులు చేసింది.. చేసేది కేసీఆరేనని విమర్శించారు. పాస్ కోర్టు కేసులో ఇరుక్కుంది కేసీఆర్ కాదా?అని ప్రశ్నించారు. టీడీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి.. కేసీఆర్ బాషను చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.
ఆస్పత్రిలో దొంగ నిరాహారదీక్ష చేస్తే 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినందునే జనం ఓట్లేసి గెలిపించారని ఎద్దేవా చేశారు.