సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన భోజన ఏర్పాట్లు అతిథులను, ఆహ్వానితులను విశే షంగా ఆకట్టుకున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ సభలకు పౌరసరఫరాల శాఖ భోజన ఏర్పాట్లు చేసింది. అతిథులకు ఏ ఇబ్బంది లేకుండా సమ యానికి భోజనాలను ఏర్పాటు చేసింది.
శనివారం మహా సభలు జరిగిన ఎల్బీ స్టేడియం, రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, లలితా కళాతోరణంలో భోజన ఏర్పా ట్లను మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ ఎస్పీ సింగ్, కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షించారు. అతిథులతో కలసి భోజనం చేశారు. వేదికలో ‘ఈరోజు భోజనం’ అంటూ పెద్ద అక్షరాలతో డిస్‌ప్లే బోర్డుపై ప్రత్యేకంగా ప్రదర్శించడంతో చాలామంది అతిథులు ఆ బోర్డు పక్కన సెల్ఫీలు దిగడం కనిపించింది.
వంటకాలు ఇవీ..
వెజ్ బిర్యానీ, పట్టువడియాల పులుసు, వంకాయ బగారా, బెండకాయ ఫ్రై, పాలకూర పప్పు, చింతకాయ, పండుమిర్చి చట్నీ, దొండకాయ పచ్చడి, పచ్చిపులుసు, టమాటా రసం, చింతపండు పులిహోర, గాజర్ కా హల్వా, డ్రైఫ్రూట్ సలాడ్, పిండి వంటలు, స్పెషల్ పనీర్ బటర్ మసాలా శనివారం వడ్డించారు.
Comments
Please login to add a commentAdd a comment