కేసీఆర్‌వి తుపాకిరాముడి మాటలు | Executive Committee member tpcc donthi madhavareddy fire on cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌వి తుపాకిరాముడి మాటలు

Published Mon, Apr 25 2016 1:01 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

కేసీఆర్‌వి తుపాకిరాముడి మాటలు - Sakshi

కేసీఆర్‌వి తుపాకిరాముడి మాటలు

కాంగ్రెస్ నుంచి పోయినోళ్లతోనే శనిపోయింది
నర్సంపేట ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు దొంతి మాధవరెడ్డి

 
మహబూబాబాద్ రూరల్ :
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్న సీఎం కేసీఆర్‌వి తుపాకిరాముడి మాటలేనని నర్సంపేట ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు దొంతి మాధవరెడ్డి విమర్శించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా పోరిక బల రాంనాయక్, పార్టీ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా నర్సం పేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నియూమకమైన సందర్భంగా మానుకోటలోని పీసీసీ సభ్యుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి ని వాసంలో ఆదివారం సన్మానసభ నిర్వహించారు. ఈ సభలో మాధవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రె స్ కార్యకర్తలు పార్టీ అధికారం లో లేదని అధైర్యపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గొప్పలు చెబుతున్నట్లుగా అభివృద్ధి లేదని, ఆయన మాటలు ఆచరణ సాధ్యమయ్యేలా లేవన్నారు. కాంగ్రెస్‌లో పదవులు పొందిన వారు పార్టీ మారడంతో శనిపోరుునట్లరుు్యందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఓటమికి గురికాలేదని, సమన్వయలోపం వల్లే ఓటమి చెందిందన్నారు. సెలక్ట్, ఎలక్ట్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.


 పార్టీ, కార్యకర్తల కోసం పనిచేస్తా
కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తల కోసం పనిచేస్తానని మాజీ ఎంపీ బలరాంనాయక్ అన్నారు. కాంగ్రెస్ పేరుతో గెలిచిన నాయకులు స్వార్థం కోసం పార్టీని వీడారని అన్నారు. రైతులకు, ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. తాను ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యూక మానుకోట నియోజకవర్గంలో కలుగజేసుకున్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే మాలోత్ కవిత తానేదో ఈ ప్రాంతాన్ని దోచుకున్నట్లు భావించేదని అన్నారు.

కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ డాక్టర్ బి.ఉమ, జడ్పీటీసీ సభ్యుడు మూల గుండ్ల వెంకన్న, ఎంపీపీలు చెల్పూరి వెంకన్న, రవీందర్‌రావుతోపాటు నాయకులు రావుల రవిచందర్‌రెడ్డి, గుగులోత్ దస్రూనాయక్, కత్తి స్వామి, అశోక్, నూనావత్ రమేష్‌నాయక్, ఉప్పల వంశీకుమార్, నూనావత్ రాధ, పెరంబుదురు వెంకటస్వామి, హెచ్.వెంకటేశ్వర్లు, అల్లం నాగేశ్వర్‌రావు, బనిశెట్టి వెంకటేష్, వంగ వెంకటరమణ, రామగోని రాజు, ఎండీ.హారుణ్, ఖలీల్, అప్పె వేణు, పుచ్చకాయల కృష్ణ  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement