ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీ
► అవసరం లేకున్నా వైద్యపరీక్షలు
► కార్పొరేట్ స్థాయిలో ఫీజుల వసూళ్లు
► కన్నెత్తిచూడని వైద్య ఆరోగ్య, డ్రగ్స్ అధికారులు
కాటారం : మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలు దోపిడికి కేరాఫ్ అడ్ర స్‌లుగా మారుతున్నాయి. మారుమూల గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని అవసరం లేకున్నా చిన్న రోగానికి సైతం అనేక వైద్యపరీక్షలు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారుు. మండల కేంద్రంలో ధనార్జనే ధ్యేయంగా పుట్టుకొస్తున్న ప్రైవేటు ఆస్పతుల పుణ్యమా అని గ్రామీణ ప్రజలు ఇళ్లుగుళ్ల చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
మండల కేంద్రంలో సుమారు 15 వరకు ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా ఒక్కో ఆస్పత్రిలో వైద్యానికి ఒక్కో రేటు చలామణి అవుతోంది. కాటారం మండలం నుంచే కాకుండా మహాముత్తారం, మహదేవపూర్ మండలాల నుంచి రోగులు అధిక సంఖ్యలో ఈ ఆస్పత్రులకు వస్తుంటారు. ఆయా మండలాల్లో అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నప్పటికీ రోగులు అధిక సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రులపై మొగ్గుచూపుతుంటారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులకు కలిసి వస్తోంది. ఉచితంగా ఓపీ చూస్తున్నామని ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు చెపుతున్నప్పటికీ అన్నీ కలిపి మందుల అమ్మకాల్లోనో లేక వైద్యపరీక్షల్లోనో వెళ్లదీస్తున్నారు.
దగ్గు, దమ్ము, జలుబు మినహా ఏ ఇతర వ్యాధులతో వచ్చిన రోగులకైన సరే రక్త, మూత్ర ఇతరత్ర పరీక్షలు చేయడం పరిపాటిగా మారింది. వీటికి కార్పొరేట్ ఆస్పత్రుల ధరలను వసూలు చేస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన అంశం కావడంతో రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద మొత్తం చెల్లించి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ఇలా ఒక్కో వైద్యుడు వద్దకు రోజుకు సుమారు 50 నుంచి 100 మంది రోగులకు పరీక్షలు నిర్వహిస్తుంటారంటే వారి సంపాదనను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రుల్లో ఎలాంటి సౌకర్యాలు లేనప్పటికీ బెడ్‌చార్జి, ఇరత చార్జీలు అంటూ పెద్ద మొత్తంలో ఫీజులు దండుకోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రూ.50 నుంచి మొదలుకొని రూ.70 విలువ చేసే గ్లూకోజు ఎక్కించినందుకు రూ.150 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నారు.
ఓ ఐదేళ్ల బాబుకు నిర్వహించిన అడ్డగోలు వైద్యపరీక్షలకు సంబంధించిన పత్రాలు
ఇటీవల మహాముత్తారం మండలానికి చెందిన ఓ వ్యక్తి జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి రాగా అవసరం లేని వైద్యపరీక్షలు చేసి వందలాది రూపాయలు దండుకున్నారు. జ్వరంతో వచ్చిన వ్యక్తికి అన్ని రకాల పరీక్షలు చేసి వారి దోపిడి బుద్ధిని నిరూపించుకున్నారు ఓ ఆస్పత్రి నిర్వాహకులు. ర క్త పరీక్షకు సాధారణంగా రూ.150 ఉండగా... ఇక్కడ మాత్రం రూ.200, మలేరియా, టైఫాడ్ టెస్ట్‌లకు రూ.200 ఉండగా, రూ.250, రక్తకణాల పరీక్షకు రూ.200 ఉండగా... రూ.400 చొప్పున వసూలు చేస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఏ డాది పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు సా ధారణ జ్వరంతో వచ్చిన వారికి కూడా ఇలాంటి ప రీక్షలు నిర్వహించి అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
అనుమతి లేకున్నా మెడికల్ దుకాణాలు
కేవలం పరీక్షల ద్వారానే కాకుండా ఆస్పత్రుల నిర్వాహకులు, వైద్యులు తమ ప్రాక్టిస్‌తోపాటు ఎలాంటి అనుమతులు లేకుండా మందుల దుకాణాలు నిర్వహిస్తూ మరింత సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా కంపెనీలకు సంబంధించిన మందులు కొనుగోళ్లు చేసేటప్పుడు శాంపిల్‌గా ఇచ్చిన మందులతోపాటు తక్కువ ధర కల్గిన మందులు తెప్పించి ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తూ భారీ మోసాలకు పాల్పడున్నారు. మందుల దుకాణాల ఏర్పాటుకు డ్రగ్‌కు సంబంధించిన ప్రత్యేక శాఖ ద్వారా అనుమతి పొంది ప్రతి ఏడాది రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉండగా... అలాంటి దాఖలాలు ఎక్కడా కానరావడం లేదు. మెడిసిన్‌కు సంబంధించి కనీస అవగాహన లేనివారు మందుల దుకాణాలల్లో ఉంటూ మందులు అందజేస్తున్నారన్న విమర్శలున్నారుు.
మామూళ్ల మత్తులో అధికారులు
మండలంలో పెద్దమొత్తంలో దోపిడీ జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ, డ్రగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన సంఘటన ఆధారంగా మొక్కుబడిగా తనిఖీలు చేపట్టిన అధికారులు ఈ మధ్యకాలంలో ఇటువైపుగా చూడలేదు. డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఇటీవల ఆర్‌ఎంపీ, పీఎంపీపై దాడులు నిర్వహించి మందులు స్వాధీనపర్చుకున్నారు. కానీ మండల కేంద్రంలోని మెడికల్ దుకాణాల వైపు ఎందుకు కనెత్తిచూడటం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిర్వాహకులు అధికారులు రాకముందే వారి వద్దకే వెళ్లి ముడుపులు ముట్టజెపుతున్నట్లు ఆరోపణలున్నారుు.
అధికంగా వసూలు చేస్తే చర్యలు
రోగులకు అడ్డగోలు వైద్యపరీక్షలు నిర్వహించి అధిక సొమ్ము వసూలు చేసే అస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాధారణ ధరలకే వైద్య పరీక్షలు నిర్వహించాలి. అర్హత ఉన్నవారే వైద్యపరీక్షలు చేయూలి. మరొకరు చేసినట్లు మా దృష్టికి వస్తే ఉన్నతాధికారులకు నివేదించి చర్యలకు ప్రతిపాదిస్తాం. కాటారంలోని ఆస్పత్రులపై ఆరా తీస్తున్నాం. ఆస్పత్రుల వివరాలను సేకరించి కలెక్టర్, డీఎంహెచ్‌వోకు అందజేస్తాం. వారి ఆదేశాల మేర కు చర్యలకు పూనుకుంటాం.
- సంయోద్దీన్, ఎస్పీఎచ్‌వో, మంథని