షి ఈజ్‌ సెలబ్రిటీ క్వీన్‌ | Facebook live Celebrity Divya Anveshitha Story | Sakshi
Sakshi News home page

షి ఈజ్‌ సెలబ్రిటీ క్వీన్‌

Oct 4 2019 11:02 AM | Updated on Oct 4 2019 11:22 AM

Facebook live Celebrity Divya Anveshitha Story - Sakshi

దివ్య అన్వేషిత కొమ్మరాజు

గుర్తింపునిచ్చిన ‘ఫేస్‌బుక్‌’

సాక్షి,సిటీబ్యూరో: ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి దివ్య అన్వేషిత కొమ్మరాజు. ‘ఫేస్‌బుక్‌’లో లైవ్‌ ఆప్షన్‌ వచ్చాక భారతీయ సంప్రదాయంతో ముస్తాబై లైవ్‌లోకి వచ్చింది. మొదటి వీడియోలోనే నెటిజన్లను తన చక్కని రూపంతో ఆకట్టుకుంది. ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ నెటిజన్లు అక్కున చేర్చుకున్నారు. ‘ఫేస్‌బుక్‌’ ద్వారా తను చేస్తున్న మంచి పనులను గుర్తిస్తూ గతేడాది ‘సాక్షి’ ‘షీ ఈజ్‌ ఫేస్‌బుక్‌ క్వీన్‌’ అంటూ ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది.

‘యస్‌.. షీ ఈజ్‌ రియల్లీ ఫేస్‌బుక్‌ క్వీన్‌’ అంటూ సాక్షాత్తు ‘ఫేస్‌బుక్‌’ కంపెనీనే అంగీకరించింది. ఒక సాధారణ యువతికి ఫేస్‌బుక్‌ అధికారికంగా ‘బ్లూ టిక్‌’ ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారి అయ్యుంటుంది. పదేళ్ల క్రితం ట్రంకు పెట్టెతో ఖమ్మం నుంచి సిటీకి వచ్చిన దివ్య అన్వేషిత ఈ రోజు టాప్‌ సెలబ్రిటీలకు దీటూగా ‘బ్లూటిక్‌’ని సాధించడంపై ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలకు దక్కిన గౌరవం తనకు దక్కడం హైదరాబాదీగా గర్వంగా ఉందంటోంది దివ్య అన్వేషిత.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement