ఫేస్‌బుక్‌ క్వీన్‌ | Divya Anveshita Star In Facebook Live Hyderabad | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ క్వీన్‌

Published Wed, May 16 2018 10:37 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Divya Anveshita Star In Facebook Live Hyderabad - Sakshi

దివ్య అన్వేషిత

ఈ అమ్మాయి పేరు దివ్య అన్వేషిత. ఈమె సెలబ్రిటీ కాదు.. హీరోయిన్‌ అంతకన్నా కాదు. కానీ.. ఫేస్‌ బుక్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌. దివ్య ప్రతిరోజు నిర్వహించే లైవ్‌ డిస్కషన్‌కు లక్షల్లో లైకులు, కామెంట్లు. అసలేంటీ దివ్య ప్రత్యేకత? ఎందుకింత ఫాలోయింగ్‌?

లంగావోణి ధరించి, నుదిటిపై బొట్టు పెట్టుకొని.. అచ్చమైన తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తయారైన ఓ అమ్మాయి హాయ్‌ అంటూ ఓరోజు ఫేస్‌బుక్‌లో నెటిజనులను పలకరించింది. ఎవరీ అమ్మాయి?
అని ఆసక్తితో అందరూ ఫాలో అయ్యారు. అలా ప్రారంభించిన తొలిరోజే 70వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈమె లైవ్‌ డిస్కషన్‌లో ఏవో సరదా కబుర్లు ఉండవు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై చర్చోపచర్చలు ఉంటాయి. అందుకే దివ్య డిస్కషన్‌కు లక్షల్లో వ్యూస్‌వస్తున్నాయి. ఆమె లైవ్‌ను 10లక్షల మంది ఫాలో అవుతుండడం విశేషం.

హిమాయత్‌నగర్‌: దిల్‌సుఖ్‌నగర్‌లోని మధురాపురీ కాలనీకి చెందిన దివ్య అన్వేషిత కొమ్మరాజుమ్యూజిక్‌లో డిప్లొమా చేసింది. ఆమెకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక రంగంలో రాణించి, అందరి మన్ననలు అందుకోవాలనే తపన. ఈ కోరికతోనే మ్యూజిక్‌ నేర్చుకుంటూ, పాటలు పాడేది. ఫేస్‌బుక్‌లో లైవ్‌ ఆప్షన్‌ వచ్చాక, ఆమె దానిపై దృష్టి కేంద్రీకరించింది. ప్రతిరోజు సాయంత్రం ఫేస్‌బుక్‌ ద్వారా దివ్య లైవ్‌లోకి వస్తుంది. ఈ లైవ్‌లో ఎందరినో పలకరిస్తూ.. వారితో మమేకం అవుతుంది. లైవ్‌లోనే కాల్స్‌ మాట్లాడుతూ... సలహాలు, సూచనలు ఇస్తుంది. నెటిజనులు తాము వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలను దివ్యతో పంచుకుంటారు. ఈమె ఇచ్చే సలహాలు, సూచనల కోసం కొన్ని లక్షల మంది లైవ్‌లో చాట్‌ చేయడంహాట్‌టాపిక్‌గా మారింది. గత రెండేళ్లలో ఈమె లైవ్‌లలో ఇప్పటివరకు 20–30 సార్లు 17లక్షలవ్యూస్‌ రాగా, 60–70సార్లు 5–7లక్షల వ్యూస్‌ ఉండడం గమనార్హం.  

ఆప్యాయంగా... అండగా  
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ లైవ్‌ ప్రారంభించే దివ్య... ఎంతోమందికి అండగా నిలుస్తోంది. జీవితంపై విరక్తితో, వివిధ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి దృక్పథాన్ని మార్చి భరోసా ఇస్తోంది. ఇటీవల కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడు తన ప్రేమ విఫలమైందని, ఇక తనకు బతకాలని లేదని ఫేస్‌బుక్‌ లైవ్‌లో దివ్యతో ఫోన్‌లో మాట్లాడాడు. ‘తల్లిదండ్రుల కంటే ప్రేమ, అమ్మాయి గొప్పది కాదంటూ’ దివ్య అతనికి వివరించింది. ఇప్పుడా యువకుడు వ్యాపారం చేసుకుంటూ హాయిగా ఉన్నాడని ఆనందం వ్యక్తం చేసింది దివ్య. ఈమె లైవ్‌ డిస్కషన్‌ ఎప్పుడూ కరెంట్‌ ఇష్యూస్‌పైనే ఉంటుంది. దేశాన్ని కుదిపేసిన కథువా ఘటనపై దివ్య లైవ్‌ ఏకంగా నాలుగు గంటలు కొనసాగింది. ఓ అమ్మాయిగా తాను బయట ఎదుర్కొనే సమస్యలను సైతం ఆరోజు లైవ్‌లో ఆమె వివరించింది.

యాడ్‌లో నాగ్‌తో...  
ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ యాడ్‌లో యాంకర్‌గా దివ్య చేసింది. అందులో హీరో నాగార్జునతో కలిసి చేసే అవకాశం దక్కింది. ఈ షూటింగ్‌ సందర్భంగా నాగ్‌ తనను అభినందించారని తెలిపింది. దివ్య లైవ్‌కు ప్రతిరోజు కనీసం రెండు లక్షలకు వ్యూస్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘92.7 బిగ్‌ ఎఫ్‌ఎం’ డిజిటల్‌ రాక్‌స్టార్‌ అవార్డుతో ఆమెను ఇటీవల సత్కరించింది. దివ్య ఫేస్‌బుక్‌ లైవ్‌తో ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చిందని ఆర్‌జే శేఖర్‌ చెప్పారు.  

లక్ష్యం.. 24 గంటలు  
ఏకదాటిగా 24గంటలు లైవ్‌ నిర్వహించి రికార్డు నెలకొల్పాలని ఉంది. దీనికోసం ఫేస్‌బుక్‌ ప్రతినిధులను సంప్రదిస్తున్నాను. నా లైవ్‌ ద్వారా ఎంతోమందికి భరోసా ఇస్తున్నాను. నేను చెప్పే మాటలు స్ఫూర్తిగా చాలామంది జీవితంలో పైకి ఎదగడం, నిరాశావాదం నుంచి బయటపడడం నాకు సంతృప్తిని ఇస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

దివ్య అన్వేషిత ,యాడ్‌లో నాగ్‌తో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement