
జీవితంలో ఓడి..‘పరీక్ష’లో పాసై..!
♦ ఫలితాల ముందు రోజే ప్రమాదంలో టెన్త్ విద్యార్థి దుర్మరణం
♦ 8.3 జీపీఏ సాధించిన విద్యార్థి
ధరూరు: జీవితంలో ఓడిపోయిన ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షలో మాత్రం పాసయ్యాడు. 8.3 జీపీఏ సాధిం చిన అతడు ఫలితాలకు ఒక రోజు ముందు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బుధవారం ఫలితాలను చూసుకుని కుటుంబమంతా మురిసిపోయి సంబురం చేసుకోవాల్సిన సమయంలో తీవ్ర విషాదం నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లా ధరూరు రంగాపురం గ్రామానికి బి.ఆంజనేయులు ధరూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివాడు. మార్చిలో పరీక్షలు రాశాడు.
మంగళవారం మహబూబ్‌నగర్‌లో టీఎస్ ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తూ మార్గమధ్యలో ధరూ రు శివారులో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే బుధవారం వెలువడిన ఫలితాల్లో ఆంజనేయులు 8.3 జీపీఏ సాధించాడు. తమ కుమారుడు పాసయ్యాడన్న విషయాన్ని తెలుసుకుని కుటుంబసభ్యులు గండెలవిసేలా రోదించారు.