వేములపల్లి (నల్లగొండ): అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన ఆర్. కృష్ణయ్య తనకున్న ఆరు ఏకరాల పొలంలో పత్తి పంట సాగుచేస్తున్నాడు. ఈ ఏడాది పంట పెరుగుదల సరిగా లేకపోవడం, గత ఏడాది అప్పులు తీరే మార్గం లేకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.