అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య | farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య

Published Sun, Mar 20 2016 9:47 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

farmer commits suicide

లింగాల ఘణపురం(వరంగల్ జిల్లా): లింగాల ఘణపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన రైతు రాగల్ల నర్సయ్య (35) అప్పుల బాధతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సయ్యకు ఎకరం భూమిలో వరి, ఎకరంన్నర భూమిలో మొక్కజొన్న సాగు చేశాడు. వర్షాభావంతో మొక్కజొన్న పూర్తిగా, వరి సుమారు అర ఎకరం ఎండిపోయూయి.

 

ఈ క్రమంలోనే పంటల సాగు, కుటుంబ అవసరాల కోసం రూ.2.50 లక్షలు అప్పు చేశాడు. పంటలు లేక అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీనికితోడు భార్యకు అనారోగ్యం, ఇటీవల తండ్రి మృతిచెందడంతో మనోవేదనకు గురయ్యూడు. ఈ క్రమంలో ఆదివారం పొలానికి వెళ్లిన నర్సయ్య మొదట ఫ్లోరేట్ గుళికలు మింగి, ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement