
దుగ్గొండి/తిర్యాణి: పంట పోయిందనే దిగు లుతో ఇద్దరు రైతులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన మోకిడె రాజు(36)కు మూడెకరాల భూమి ఉండగా, మరో ఎకరం కౌలుకు తీసుకున్నా డు. మూడు ఎకరాల్లో పత్తి వేశాడు.
అప్పుచేసి రూ.80 వేలు పెట్టుబడి పెట్టాడు. వర్షాలతో పంట దెబ్బతింది. దీంతో మనస్తాపం చెందిన రాజు పురుగుల మందు తాగాడు. కుమ్రం భీం జిల్లా తిర్యాణి మండలం గోయగాం గ్రామానికి చెందిన మేరగొండ మల్లేశ్ (30) గోయగాంలో ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కోసం రూ.లక్షన్నర అప్పు చేశాడు. పత్తి దిగుబడి బాగా తగ్గడంతో మనస్తాపం చెందిన మల్లేశ్ ఇంటిలో పురుగుల మందు తాగాడు.
Comments
Please login to add a commentAdd a comment