వరంగల్ (వర్ధన్నపేట) : వర్ధన్నపేట మండలం ఇల్లందులో మంగళవారం సాయంత్రం సాంబయ్య(45) అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సాంబయ్యకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇటీవల వర్షాలు లేక పంట ఎండిపోయింది. కూతురు ఏడాదిగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలంగా ఇంట్లో గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన సాంబయ్య ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.