మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలంలో ఓ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన దుగ్గపురం రామచంద్రయ్య (50) తనకున్న కొద్దిపాటి పొలంతో పాటు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లాడు. అయితే, పొలం చుట్టూ వేసిన ఫెన్సింగ్ తీగలపై మంగళవారం రాత్రి కురిసిన గాలి వానకు పైగా వెళ్తున్న విద్యుత్ తీగ పడింది. అది తెలియని రామచంద్రయ్య ఫెన్సింగ్ తీగను తాకటంతో షాక్‌నకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రామచంద్రయ్యకు భార్య అలివేలుతో పాటు ముగ్గురు పిల్లలున్నారు.
(తలకొండపల్లి)
కరెంట్‌షాక్‌తో రైతు మృతి
Published Wed, Apr 15 2015 5:50 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
Advertisement
Advertisement