పరిహారం కోసం నిర్వాసితుల ఆందోళన
Published Thu, Aug 20 2015 2:27 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
తిర్యాణి: తమ భూములు సేకరించి ఆరేళ్లయినా ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదంటూ సింగరేణి భూనిర్వాసితులు నిరసనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం కైరిగూడలోని ఓసీపీ కోసం చుట్టుపక్కల గ్రామాలైన డోర్లి, దేవయ్యగూడ, ఉల్లిపిట్ట, చందుగూడలకు చెందిన భూములను అధికారులు తీసుకున్నారు. ఆయా గ్రామాల రైతులు గురువారం మధ్యాహ్నం కైరిగూడ ఓసీపీ ఎదుట నిరసన తెలిపారు. తమకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement