వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న 'ఫాస్ట్': హైకోర్టు
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఫాస్ట్ జీవోపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫాస్ట్ జీవో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలా చేయడం వల్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో అడ్మిషన్లు తీసుకోరని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.
కాగా, కేసీఆర్ ప్రభుత్వాన్ని కోర్టు తప్పుబట్టడం ఇది మొదటిసారేమీ కాదని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టే విధానాలు సరికావని కోర్టులు కేసీఆర్ సర్కారుకు గుర్తుచేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందనడానికి హైకోర్టు వ్యాఖ్యలే నిదర్శనమని పొన్నాల తెలిపారు.