జల్సాల కోసం దోపిడీలు
ఐదుగురి నిందితుల అరెస్టు
చోరీ సొత్తు స్వాధీనం
శంషాబాద్ రూరల్ : బైక్‌లపై తిరుగుతూ అర్ధరాత్రి వేళ దారి దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఐదుగురు నిందితుల్లో ఓ బాలు డు ఉన్నాడు. వివరాలిలా ఉన్నాయి. కొన్నాళ్లుగా హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురాకు చెందిన ఎం.డి.హైమద్, ఎం,.డి.సమీ, మైలార్‌దేవ్‌పల్లిలోని శాస్త్రీపురం వాసి ఎం.డి.అఫ్రోజ్‌ఖాన్, కాలాపత్తర్‌కు చెందిన ఎం.డి.ఖదీర్‌తోపాటు 17ఏళ్ల బాలుడు జల్సాలకు అలవాటై దోపిడీలకు పాల్పడుతున్నారు. హైమద్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. అఫ్రోజ్‌ఖాన్ ఆటోడ్రైవర్ కాగా సమీ, ఖదీర్ ఇంటర్మీడియెట్ చదువుతున్నారు.
వీరంతా తరచూ రాత్రివేళ రెండు బైక్‌లపై దోపిడీకి బయలుదేరతారు. రహదారుల వెంబడి తిరుగుతూ నిర్జన ప్రదేశంలో వాహనాలను ఆపి దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి శంషాబాద్ మండలంలో రెండు వేర్వేరు చోట్ల ఇదే తరహాలో చోరీ చేశారు. అదేరోజు కందకూరు మండలం చెవులపల్లికి చెందిన కె.కృష్ణ తన ఆటోట్రాలీలో కూరగాయల లోడుతో షాద్‌నగర్ నుంచి నల్గొండ వెళుతున్నాడు. శంషాబాద్ మండలం బుర్జుగడ్డతండా సమీపంలోని పీ-వన్ వద్దకు చేరుకోగానే ఈ ముఠా అడ్డుకుంది. కత్తులతో బెదిరించి కృష్ణ నుంచి తులం బంగారుగొలుసు, రూ.4,800తోపాటు సెల్‌ఫోన్‌ను దోచుకున్నారు.
దుండగులు అక్కడి నుంచి పాల్మాకుల మీదుగా బెంగళూరు జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం బండగొండకు చెందిన నారాయణరెడ్డి, మద్దూరు మండలం చెన్వారం రైతు వెంగల్‌రెడ్డి కలిసి బొలేరో వాహనంలో బత్తాయి పండ్లను హైదరాబాద్ నగరంలోని కొత్తపేట మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. పెద్దషాపూర్ వద్దకు రాగానే ఈ దోపిడి ముఠా వీరి వాహనాన్ని అడ్డుకుంది. బెదిరించి నారాయణరెడ్డి వద్ద రూ.పది వేలతో పాటు సెల్‌ఫోన్, వెంగల్‌రెడ్డి నుంచి రూ.నాలుగు వేలు, సెల్‌ఫోన్ దోచుకున్నారు.
మరో ఐదు ఠాణాల పరిధిల్లో...
ఈ దోపిడీ ముఠా శంషాబాద్‌తోపాటు ఇబ్రహీపట్నం, నా ర్సింగ్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వివిద ప్రాంతాల్లో ఇదే తరహాలో దోపిడీలకు పాల్పడింది. సెల్‌ఫోన్లు, నగదు, బంగారు నగలతోపాటు బైక్‌లను దోచుకున్నారు. ఈ సంఘటనలు అన్నీ గత నెలలోనే చోటుచేసుకోగా చివరిసారిగా శంషాబాద్ ప్రాంతంలో జరగడం గమనార్హం. ఈ మేరకు ఆయా పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోద య్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు బుధవారం నిందితులను అదుపులోకి తీసుకునివిచారణచేపట్టగా ఈ దొంగతనాలకు పాల్పడింది తామేనని అంగీకరించారు. దీంతో వారి నుంచి ఏడు బైక్‌లు, ఆరు సెల్‌ఫోన్లు, రూ.13 వేలు, తులం బంగారుగొలుసు స్వాధీనం చేసుకున్నారు.
ఎముకలతో నూనె తయారుచేస్తున్న నలుగురి రిమాండ్
ధారూరు:పశువుల ఎముకలు, కొవ్వు తో నూనె తయారుచేసిన కేసులో బుధవారం నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజులుగా ధారూరు మండలం మైలారం శివారు అటవీప్రాంతంలోని మద్దులపల్లి కృష్ణ పొలంలో కొందరు వ్యక్తులు పశువుల ఎముకలు, కొవ్వు తో నూనె తయారు చేస్తున్నారు. దీని పై మైలారం గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వికారాబాద్ సబ్‌కలెక్టర్ అలుగు వర్షిణి, పోలీసులు ఈనెల 14న ఈ స్థావరంపై దాడిచేశారు. ఈ ప్రాంతంలో ఎముకలు, కొవ్వుతోపాటు డీసీఎం, నూనె తయారుచేసేం దుకు అమర్చిన సామగ్రిని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు.
ఈ మేరకు మోమిన్‌పేట్ సీఐ ఎన్‌వీ రంగా, ధారూరు ఎస్‌ఐ ఎం.మల్లేశం కేసు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు బుధవారం ఈ నూనె తయారీలో ప్రధాన సూత్రదారులైన వికారాబాద్ పట్టణం కొత్తగడికి చెందిన ఆసీఫ్, హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురా వాసి రహీమ్‌తోపాటు డీసీఎం యజమాని ఖాజాపాషా, పొలం యజమాని ఎం. కృష్ణను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండుకు తరలించారు.
దొంగల ముఠా ఆటకట్టు
Published Thu, Jul 23 2015 12:04 AM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM
Advertisement