పెన్షనర్లకు పండగ
- క్యాబినెట్ ఆమోదంతో పెరగనున్న పింఛన్లు
- హైదరాబాద్ జిల్లాలో 83 వేల మందికి లబ్ధి
సాక్షి, సిటీబ్యూరో: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ల పెంపునకు రాష్ట్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపడంతో నగరంలోని పెన్షనర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని పింఛన్లతో అవస్థ పడుతూ బతుకులీడుస్తున్న పింఛనర్లలో క్యాబి నెట్ నిర్ణయం కొత్త ఆశలు చిగురింపజేసింది. ఇప్పటి వరకు వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం నుంచి పింఛన్‌గా కేవలం రూ.200, వికలాంగులకు రూ.500 అందుతుండగా, తాజా పెంపుతో వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 వంతున అందనుంది.
రాష్ట్ర సర్కారు తాజా నిర్ణయంతో హైదరాబాద్ జిల్లాలో 83వేల 752మందికి లబ్ధికి చేకూరనుంది. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ప్రతినెలా పింఛనర ్లకు 2.09కోట్లు అందుతుండగా, తాజా పెంపుతో ఇకపై ఈమొత్తం నెలకు రూ.9.06 కోట్లు కానుంది. దసరా పండుగ నుంచి పెరిగిన పింఛను అమలులోకివస్తుందని సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏ కేటగిరి పెన్షనర్లు ఎంతమందంటే..
కేటగిరి పెన్షనర్లు ప్రస్తుతం(రూ.ల్లో) దసరా నుంచి(రూ.ల్లో)
వృద్ధులు 33, 060 66,12,000 3,30,60,000
వితంతువులు 36, 869 73,73,800 3,68,69,000
వికలాంగులు 13,823 69,11,500 2,07,34,500
మొత్తం 83,752 2,08,97,300 9,06,63,500