ఔషధ పరిశ్రమలో అగ్నిప్రమాదం
ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
- షార్ట్ సర్క్యూట్‌తో మంటలు... పేలిన సిలిండర్
- గగన్‌పహాడ్ సంజైమ్ పరిశ్రమలో ఘటన
శంషాబాద్: హైదరాబాద్ రాజేంద్ర నగర్ సర్కిల్ గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలోని సంజైమ్ ప్రైవేటు లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో మంగళ వారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెం దగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పరిశ్రమలోని ఓ ప్లాంటు అర్ధరాత్రి 2 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో పొగలు వచ్చాయి. దీంతో పక్క ప్లాంటులో విధులు నిర్వర్తిస్తున్న గగన్‌పహాడ్ బస్తీకి చెందిన తలారి శంకర్ (45), సాతం రాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ లు అక్కడికి వెళ్లారు. అక్కడే ఉన్న ఓ సిలిండర్ పేలడంతో ప్లాంటు పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన శంకర్ అక్కడికక్కడే మృతి చెందగా... శ్రీనివాస్ మంటల్లో చిక్కుకుపోయి తీవ్ర గాయాలపాల య్యాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. రెండు ఫైరింజన్లు రెండుగం టల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాయి.
మృతుడు శంకర్‌కు భార్య చంద్రకళ, ఇద్దరు సంతానం ఉన్నారు. సుమారు 27 ఏళ్లుగా శంకర్ అదే పరిశ్రమలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. విష యం తెలుసుకున్న కుటుంబసభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకుని మృతదే హాన్ని చూసి బోరున విలపించారు. అతడి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకా ష్‌గౌడ్ పరిశ్రమను సందర్శించి మృతు డి కుటుంబాన్ని పరామర్శించారు. తగిన నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి యాజమాన్యం అంగీక రించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పరిశ్రమను సందర్శించిన సంఘాలు
పరిశ్రమలోని ఘటన స్థలాన్ని టీఎన్‌టీయూసీ నాయకులు ధనుం జయ్, ఏఐటీయూసీ నాయకులు ఓరుగంటి యాదయ్య, పుస్తకాల నర్సింగ్‌రావు, సీఐటీయూ నాయ కులు సందర్శించారు. మృతుడి కు టుంబానికి 30 లక్షల నష్టపరి హారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా పరిశ్రమలో భద్రత ప్రమాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.