బాంబ్రాగఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు మృతి
కాగజ్‌నగర్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం సరిహద్దు మహారాష్ట్రలోని బాంబ్రాగఢ్ తాలూకా తాడ్వాగాం పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మావోయిస్టు సరిత (35) మృతి చెందినట్లు బాంబ్రాగఢ్ సబ్‌డివిజనల్ పోలీసు అధికారి జి.పవన్ తెలిపారు.
తాడ్వాగాం పోలీసుస్టేషన్ పరిధిలోని బాండేనది ప్రాంతంలో పోలీసులు కూం బింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో మావోయిస్టు ఉపదళ కమాండర్ సరిత మృతి చెందింది. కాగా, మృతురాలి వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీని స్వాధీన పరుచుకున్నట్లు ఎస్‌డీపీ తెలిపారు. పోలీసు కూబింగ్ ఇంకా కొనసాగుతోందని వివరించారు.
ఆదిలాబాద్ లో ఎదురు కాల్పులు
Published Wed, Apr 20 2016 4:14 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement