దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ డిపోకు చెందిన బస్సు గుంటూరుకు వెళుతుండగా దండేపల్లి మండలం లింగాపూర్ వద్ద ఒక్కసారిగా బస్సు బ్యాటరీలో నుంచి మంటలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ శ్రీనివాస్ వెంటనే బస్సును పక్కకు ఆపి జస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులను కిందకు దించేశాడు. డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించడం వల్లే తాము సురక్షితంగా బయటపడ్డామని ప్రయాణికులు తెలిపారు.