ఫిట్‌లెస్ బస్సులు | fitness tests to the buses | Sakshi
Sakshi News home page

ఫిట్‌లెస్ బస్సులు

Published Sun, Jun 8 2014 2:30 AM | Last Updated on Thu, Apr 4 2019 5:42 PM

ఫిట్‌లెస్ బస్సులు - Sakshi

ఫిట్‌లెస్ బస్సులు

 బాన్సువాడ, న్యూస్‌లైన్ :  ఏటా జిల్లాలోని విద్యా సంస్థలకు చెందిన బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించడం ఆ నవాయితీ. ఏప్రిల్ చివరి వారం నుంచి మే 15 వ తేదీ వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. ఈ ఏ డాది మాత్రం రవాణా శాఖ అధికారులు వాటి ఊసు మరిచారు. చాలా పాఠశాలలు కాలం చెల్లిన బస్సులనే వినియోగిస్తున్నాయి. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువా డ పట్టణాల్లోని పలు మెకానిక్ షెడ్లలో ఇలాంటి బస్సులు కనిపిస్తాయి. విద్యాసంస్థల యజమానులు వీటినే నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. జీవిత కాలం ముగిసిన స్కూల్ బస్సులను సీజ్ చేయాలని ఆదేశాలున్నా.. జిల్లాలో ఒక్క వాహనాన్నీ సీజ్ చేసిన దాఖలాలు లేవు.
 
 మార్గదర్శకాలివి

* స్కూల్ బస్సు ముందు భాగంలో ఎడమ వైపున పాఠశాల పేరు, ఫోన్ నంబర్, ఇతర పూర్తి వివరాలు పెద్ద అక్షరాలతో స్పష్టంగా కనిపించేలా రాయించాలి.
* పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి వయసు 60 ఏళ్లకు మించకూడదు. డ్రైవింగ్ లో ఐదేళ్ల అనుభవం ఉన్న వ్యక్తినే డ్రైవర్‌గా తీసుకోవాలి. డ్రైవర్‌కు ప్రతి మూడు నెలల కోసారి రక్తపోటు, మధుమేహం, కంటిచూ పు వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను చే యించాలి. ఆ రికార్డులను జాగ్రత్తగా భద్రపర్చాలి.
* విద్యార్థులు బ్యాగులను భద్రపర్చుకోవడానికి సీట్ల కింద అరలు ఉండాలి.
* విద్యార్థుల పేర్లు, తరగతి, ఇంటి చిరునామా, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు, సదరు విద్యార్థి దిగాల్సిన స్థలం వంటి వివరాలు బస్సులో ఉండాలి. విద్యార్థుల పేరుకు ఎదుట ఆయా వివరాలు సూచిస్తూ బస్సులో రూట్‌ప్లాన్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
* సీట్ల పరిమితికి మించి విద్యార్థులను తరలించరాదు.
* బస్సులో రోజూ ఒక టీచర్, ఒక పేరెంట్ ప్రయాణించే ఏర్పాట్లు చేయాలి.
* విద్యార్థులను తీసుకెళ్లే బస్సులో రవాణాశాఖ కమిషనర్ జారీ చేసిన విద్యాసంస్థ బస్ పర్మి ట్, ఆ బస్సు జీవిత కాలం తేదీ తప్పనిసరి గా పొందుపర్చాలి. డ్రైవర్ ఏడాదిలో ఒకసారైనా రవాణా శాఖ ద్వారా నిర్వహించే ఒక రోజు ప్రత్యేక శిక్షణకు హాజరయ్యేలా చూడాలి.
 
 ఇవి తప్పనిసరి
బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు విద్యార్థు లు డ్రైవర్‌కు కనిపించేలా బస్సుకు రెండు వై పులా అద్దాలుండాలి. బస్సు అంతర్భాగంలో నూ పెద్ద అద్దం తప్పనిసరి. పాఠశాల బస్సు కు నాలుగు వైపులా పైభాగం మూలల్లో బ యటి వైపు పసుపు పచ్చని రంగుతో ఫ్లాషిం గ్ లైట్లుండాలి. విద్యార్థులు బస్సులో నుంచి కిందికి దిగేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు ఆ లైట్లను తప్పనిసరిగా వెలిగించాలి.
     
బస్సు ఫుట్‌బోర్డు, తలుపులు పట్టిష్టంగా ఉండాలి. మొదటి మెట్టు భూమి నుంచి 325 ఎంఎం ఎత్తుకు మించకూడదు.  అత్యవసర మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టెను, బస్సు ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో ఒక అగ్నిమాపక యంత్రాన్ని, పొడిని అందుబాటులో ఉంచాలి. ప్రతి పాఠశాల యాజమాన్యం రవాణా, పోలీసు, విద్యా శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏడాదిలో కనీసం ఒకరోజు రహదారి భద్రతపై తరగతులు నిర్వహించాలి. ప్రమాదాలు జరిగే తీరు, నివారణ, ప్రథమ చికిత్స వంటి అంశాలపై అవగాహన కల్పించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement