ఫిట్‌నెస్ లేకుంటే సీజ్
డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్
మామునూరు : ఫిట్‌నెస్‌లేని ప్రైవేటు పాఠశాల, కళా శాల బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని ప్రాంతీయ రవాణ శాఖ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ హెచ్చరించారు. బుధవారం వరంగల్ ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేని, ఫిట్‌నెస్ లేని వాహనాలల్లో విద్యార్థులను పాఠశాల, కళాశాలలకు తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదాలకు తావివ్వకుండా గురువారం(12వ తేదీ) నుంచి నెలరోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామ న్నారు. టాటా ఏస్, ఆటోరిక్షాల్లో పరిమితికి మించి విద్యార్థులను పాఠశాలలకు త రలించే వాహనాలను సీజ్‌చేయడమే కాకుండా డ్రైవర్ లెసైన్స్ సైతం రద్దుచేస్తామని చెప్పారు. పాఠశాలలకు బస్సుల్లో పిల్లలను ఎంత మందిని తరలిస్తున్నారు, ఎంతమేరకు పిల్లలుకు రక్షణలో ఉన్నారో మందుగానే తల్లిదండ్రులు గమనించాలని, ఆటోరిక్షాలో పిల్లలను బడికి పంపకుండా జగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల మొదటి సోమవారం వాహనాదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు.
టీ ఎస్ సిరీస్ ఉత్తర్వులు విడుదల
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలోని అన్ని రకాల వాహనాలకు టీఎస్ సిరీస్‌ను ఆమలు చేయాలని బుధవారం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు విడుదల చేసినట్లు డీటీసీ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో లోగోతో కూడిన టీఎస్ సిరీస్‌ను జిల్లాలో ఆమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్లైడింగ్‌లో బుక్ చేసుకున్న ప్రతి వాహనానికి టీఎస్ నంబర్ ప్లేట్ విడుదల చేస్తామని వెలడించారు. కొత్త వాహనాలకు కొత్త నంబర్లు రానున్నాయని, పాత వాహనాలకు నంబర్లు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొ న్నారు. 2013-214 వార్షిక బడ్జెట్‌లో రూ.106కోట్ల ఆదాయం నిర్దేశించగా రూ.85కోట్ల మేరకు సాధించామన్నారు. లైఫ్ టాక్స్ జూన్1లోపు కట్టిన వాహనాలన్నింటికీ ఉమ్మడి రాష్ట్రాల్లో చెల్లుబాటు ఉంటుందని తెలిపారు. పర్మిట్ ఎక్స్‌పైర్ అయ్యేంత వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వాహనాలు తీరిగేందుకు అభ్యంతరాలు ఉండవన్నారు. సమావేశంలో ఆర్టీఓ మాధవరావు, సీనియర్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ జయకుమార్ పాల్గొన్నారు.