సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో గైర్హాజరు కారణంగా డిస్మిస్ చేసిన కార్మికులకు వన్‌టైం చాన్స్ కింద ఉద్యోగాలివ్వాలని తెలంగాణ సింగరేణి డిస్మిస్ కార్మికుల సంఘం అ«ధ్యక్షుడు కె.శ్రీనివాస్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వన్‌టైం చాన్స్ కింద అవకాశం కల్పించే అంశంపై చర్చిస్తామన్న యాజమాన్యం ప్రతిసారీ దీన్ని వాయిదా వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే డిస్మిస్ కార్మికులందరికీ ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు తమ సమస్య పరిష్కరించలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం తమ సమస్యలపై స్పందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment