చెట్టు కోడితే ‘వాల్టా’ వాతలు పెట్టుద్ది! | Forest Department has been fined for hitting trees | Sakshi
Sakshi News home page

చెట్టు కోడితే ‘వాల్టా’ వాతలు పెట్టుద్ది!

Published Sat, Feb 29 2020 2:59 AM | Last Updated on Sat, Feb 29 2020 9:19 AM

Forest Department has been fined for hitting trees - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: నగరంలోని ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో అనుమతి లేకుండా 40 చెట్లను కొట్టివేసినందుకు వాల్టా చట్టం అతిక్రమణ కింద ఓ సంస్థకు అటవీ శాఖ రూ.53,900 జరిమానా విధించింది. దీంతోపాటుగా కొట్టిన చెట్లకు బదులుగా 80 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని షరతు విధించింది. కూకట్‌పల్లిలోని ఇందు ఫార్చూన్‌ ఫీల్డ్‌లో సంబంధిత శాఖల అనుమతి లేకుండా దాదాపు 40 చెట్లు కొట్టివేయడంపై స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కమ్యూనిటీలో అదనపు సౌకర్యాల కల్పన కోసం చెట్లు కూల్చాల్సి వచ్చిందని, కొట్టేసిన చెట్లను ట్రాన్స్‌లొకేట్‌ చేశామని ఇందు ఫార్చూన్‌ ఇచ్చిన వివరణతో అటవీశాఖ అధికారులు సంతృప్తిచెందలేదు. ఈ చెట్ల నరికివేతకు సంబంధించి మేడ్చల్‌ జిల్లా అటవీ అధికారి సుధాకర్‌ రెడ్డి, సిబ్బంది పరిశీలించి చెట్ల నరికివేత, మరోచోట వాటిని పెట్టడం శాస్త్రీయంగా జరగలేదని నిర్థారించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement