మిల్లర్ల ఎత్తులకు ఐకేపీ
(ఇందిరా క్రాంతి పథం) ధాన్యం కొనుగోలు నిర్వాహకులు, రైతులు చిత్తవుతున్నారు. తూకాల్లో మిల్లర్లు పెద్దఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్కో లోడ్ లారీలో పెద్దఎత్తున తూకంలో కోత పెట్టి అక్రమంగా జేబులు నింపుకుంటున్నారు. ఫలితంగా ఐకేపీ కేంద్రాల నిర్వాహకులకు కమీషన్ మాట దేవుడెరుగు మరింత నష్టం వాటిల్లుతోంది.
సాక్షి, నల్లగొండ: ధాన్యానికి మద్దతు ధర కల్పించడం, గ్రామ సంఘాలు ఆర్థికంగా పరిపుష్టం కావడానికి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రైతులు రబీలో వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అందుకు తగ్గట్లుగా ధాన్యం దిగుబడి పెద్ద ఎత్తున వస్తోంది. ధాన్యాన్ని రైతులు తమకు అందుబాటులో ఉన్న ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. ఇలా పోగైన ధాన్యాన్ని ఐకేపీ నిర్వాహకులు ఎప్పటికప్పుడు లారీల్లో మిల్లులకు తరలిస్తుంటారు. అయితే ఇలా తీసుకెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు తూకం వేసుకుని ధాన్యాన్ని దింపుకుంటారు.
ఇక్కడే కిటుకు....
ఐకేపీ కేంద్రం నుంచి లారీలో వెళ్లిన ధాన్యం బరువుకు.. మిల్లుల వద్ద చేసే తూకానికి పొంతన కుదర డం లేదు. తీసుకెళ్లిన ధాన్యం కంటే.. మిల్లులకు చేరుకున్న ధాన్యంలో తరుగుదల కనిపిస్తోంది. ఒక్కో లారీ లోడ్‌కు దాదాపు 3 క్వింటాళ్ల ధాన్యాన్ని తక్కువగా తూకం వేస్తూ మిల్లర్లు ఐకేపీ కేంద్రాలను నిలువునా మోసం చేస్తున్నారు. ఇప్పటికే తాలు, తరుగు పేరిట మాత్రమే కోత విధిస్తున్నారని అనుకున్నాం. కానీ తూకాల్లోనూ అవకతవకలు పాల్పడుతూ అక్రమంగా జేబులు నింపుకుంటున్నారు. ఒక్కో లారీ లోడ్‌కు దాదాపు 3 క్వింటాళ్ల వరకు తక్కువగా తూకం వేస్తున్నారు. ఒక్కో క్వింటా ధాన్యం ధర రూ. 1345. ఈ లెక్కన మూడు క్వింటాళ్లకు కలుపుకుంటే రూ.4035లు నిర్వాహకులు నష్టపోతున్నారు.
గోనె సంచులపైనా కోత...
ఒక్కో గోనెసంచి బరువు ఇంచుమించు 650 గ్రాములు ఉంటుంది. ఇదే పరిమాణాన్ని మిల్లర్లు పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఒక్కో గోనెసంచి బరువు 800 గ్రాములుగా లెక్కించి తరుగు తీస్తున్నారు. ఒక్కో లారీలో 500 వరకు ధాన్యం బస్తాలు లోడ్ చేస్తారు. ఇలా ప్రతి సంచికి 150 గ్రాములు అదనంగా కోత విధించడం వల్ల కూడా ఐకేపీ నిర్వాహకులు నష్టపోతున్నారు. రోజుకు వేల బస్తా లు మిల్లుల వ ద్దకు వెళ్తుంటాయి. వీటన్నిం టినీ లెక్కిస్తే నష్టం కూడా పెద్దఎత్తునే ఉం టుంది. ఇలా అన్ని రకాలుగా ఐకేపీ నిర్వాహకులను మిల్లర్లు మోసం చేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే అధికారులు దాడులు నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటేనే కొనుగోళ్లు న్యాయబద్ధంగా జరుగుతాయని ఐకేపీ నిర్వాహకులు కోరుతున్నారు.
తూకం మాయ
Published Wed, May 7 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM
Advertisement
Advertisement