1,00,000
నాలుగో రోజు పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
భక్తజనంతో కిక్కిరిసిన పుష్కరఘాట్లు
మంగపేటలో పుష్కరస్నానం
ఆచరించిన మంత్రి ఇంద్రకరణ్ దంపతులు
గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం పుష్కర ఘాట్లలో నాలుగో రోజు శుక్రవారం లక్ష మందికి పైగా భక్తులు పుష్కరస్నానం చేశారు. వరుసగా రెండురోజులపాటు సెలవులు ఉండడంతో ప్రజలు గోదారి బాట పట్టారు. దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు మంగపేట పుష్కరఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి శని, ఆదివారాల్లో పుష్కరఘాట్ల వద్ద పర్యటించనున్నారు. - మంగపేట
మంగపేట : మండల కేం ద్రంతోపాటు గోదావరి పు ష్కరఘాట్ నాలుగోరోజు శుక్రవారం భక్తజనసంద్రమైంది. సుమారు 80 వేల మంది తరలివచ్చారని అ ధికారులు అంచనా వేశా రు. అధికారులు ఊహించ ని విధంగా భక్తులు తరలిరావడం, నదిలో పుణ్యస్నానాలు ఆచరించడంతో గోదారమ్మ పులకించింది. ఎండను సైతం లెక్కచేయకుండా రెండున్నర కిలోమీటర్ల దూరం నడిచి గంగమ్మ ఒడికి చేరుకున్నారు. అనంతరం ఉమాచంద్రశేఖరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. కాగా, శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.