'తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తూ నాశనం'
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు వల్ల తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 1956 సంవత్సరాన్ని కటాఫ్ డేట్గా నిర్ణయించడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు.
విదేశీ పౌరసత్వం ఉన్నవాళ్లు కూడా మీ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు గానీ, తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండకూడదా అని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీపై కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని, ఇలాంటి ముఖ్యమైన అంశాల్లో తల, తోక లేని నిర్ణయాలు తీసుకోవద్దని కిషన్రెడ్డి టీఆర్ఎస్ సర్కారుకు హితవు పలికారు.