ఆంక్షలతో రుణమాఫీ పూర్తిగా చేయకుండా మోసం: కిషన్‌రెడ్డి
బాధిత రైతుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 8886 100 097
రుణమాఫీ కాని రైతులు దీనికి కాల్ చేసి వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి
దీనికి విశేష స్పందన వస్తోందంటున్న బీజేపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏవేవో ఆంక్షలు పెట్టి రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకుండా రైతులను దగా చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. అధికారం కోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని విమర్శించారు. రుణమాఫీ కాని రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభిస్తున్నట్టు కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
‘‘రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దగా చేస్తోంది. రైతులకు ఏ ప్రతిపాదికన రుణమాఫీ చేస్తున్నారన్న అంశాన్ని స్పష్టం చేయాలి. చాలా మంది రైతులు రుణమాఫీ జరగక బ్యాంకుల్లో డీఫాల్టర్‌గా మారే దుస్థితి ఏర్పడింది’’అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మోసపూరిత హామీలిచి్చ, అధికారంలోకి వచ్చాక దగా చేయడంలో అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ ఒకటేనని ఆరోపించారు.
రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం..
గ్రామస్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి, రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరిస్తామని.. ఆ వివరాలను ప్రభుత్వానికి పంపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. రైతులు, యువత, బీసీలు, మైనారిటీలు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యారంగానికి 14 శాతానికిపైగా బడ్జెట్ కేటాయిస్తే.. అది తెలంగాణలో 7.60 శాతమేనన్నారు.
మాటలు కోటలు దాటినా..
కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దా టుతున్నా.. చేతలు సెక్రటేరియట్ దాటడం లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పంటలకు మద్దతు ధర పెంపు, నిరుద్యోగులకు జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామన్న హామీలు ఏమైపోయాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మ ద్యం అమ్మకాలు, భూముల అమ్మకాలతోనే ఆదాయం పెంచుకోవాలని ఆలోచిస్తోందే తప్ప.. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదన్నారు.
ఇదీ బీజేపీ హెల్ప్‌లైన్ నంబర్
రుణమాఫీకాని రైతులకు అండగా నిలిచేలా, ‘రైతుల పక్షాన కాంగ్రెస్ సర్కారును ప్రశి్నస్తున్న తెలంగాణ’ పేరుతో బీజేపీ పోస్టర్‌ను కిషన్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం హెల్ప్‌లైన్ నంబర్ 8886 100 097ను ప్రారంభించారు. కాగా.. ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు విశేష స్పందన వస్తోందని బీజేపీ నేతలు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment