జనరిక్ మెడికల్ షాపును ప్రారంభిస్తున్న డిప్యూటీ డైరెక్టర్ సురేంద్రనాథ్‌సాయి
నిజామాబాద్ అర్బన్ : జనరిక్ మందులు ఎంతో ప్రయోజనకరమని మధ్య, పేద తరగతి వారికి ఆర్థిక భారం ఉండదని రాష్ట్ర ఔషధ నియంత్రణ డిప్యూటీ డైరెక్టర్ సురేంద్రనాథ్‌సాయి అన్నారు. ఆదివారం నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద మెడిజన్ జనరిక్ మందుల షాపును ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ జనరిక్ మందులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
మరికొద్ది రోజు ల్లో మండలస్థాయిల్లో మూడు మందుల షాపుల చొప్పున ప్రారంభించనున్నామన్నారు. ప్రభుత్వం జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. మందులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. జనరిక్ మందులు కంపెనీల మందులతో సమానంగా పనిచేస్తాయన్నారు. ప్రజలకు ఆర్థికభారం ఉండదన్నారు. షాపు నిర్వహకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment