ఢిల్లీ వరకు గులాబీ జెండా ఎగరాలి
ఇందల్వాయి(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడంవల్లే తెలంగాణవాదం గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్లిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో ప్ర జలంతా ఐకమత్యంగా గులాబీ జెండాకు బలమిచ్చి, అండగా ఉండి గల్లీ నుంచి ఢి ల్లీ వరకు ఎగిరేలా చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
గురువారం డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి గ్రామంలో టీఆర్‌ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి జీనియస్ లక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి బాలసాయిలు కు మద్దతుగా కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించడమే ప్రధాన లక్ష్యం గా భావిస్తుందన్నారు. 14 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలు అనేక కష్టనష్టాలకు ఓర్చి తెలంగాణ సాధన కోసం ఉద్యమించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల కష్టం తో వచ్చిందన్నారు.
మన రాష్ట్రాన్ని మన మే పాలించుకోవాలని అన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే వందలాది పనులు చేసుకోవచ్చని అన్నారు. ప్రచారంలో టీఆర్‌ఎస్ రూరల్ ఇన్‌చార్జి డాక్టర్ భూపతిరెడ్డి, మండల అధ్యక్షుడు జీనియస్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్‌కు కానుకగా ఇవ్వండి
నందిపేట: టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి, కేసీఆర్‌కు కానుకగా ఇస్తే తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుటుందని క విత అన్నారు. మండలంలోని వెల్మల్ గ్రామంలో టీఆర్‌ఎస్ జడ్పీటీసీ, ఎంపిటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు.
వారిని నిలదీయండి
మాక్లూర్ : మాక్లూర్ మండలంలో కవిత ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ తెలంగాణ ద్రోహులని, ఏమి అభివృద్ధి చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఎం దుకు ఓటు వేయాలని వారిని నిలదీసి చి త్తుగా ఓడించాలన్నారు. అనంతరం ఆ ర్మూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. అ నంతరం టీడీపీకి చెందిన100 మంది కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.