
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థ మోసాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం.. నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేసింది. ఇక గ్లోబరినా ప్రైవేట్ లిమిటెడ్ ఐటి సొల్యూషన్స్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017లో కాకినాడ జేఎన్టీయూలో ఈ సంస్థ మోసాలు బయటపడ్డాయి. కాకినాడ జేఎన్టీయూలో ఈ లెర్నింగ్. ఈ కంటెంట్ టెండర్లలో గ్లోబరీనా మోసాలకు పాల్పడిందని కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రూ.36 కోట్ల ఒప్పందంతో టెండర్ దక్కించుకున్న సంస్థ రూ.26 కోట్ల అవినీతికి పాల్పడిందని జేన్టీయూ కాకినాడ రిజస్టరే స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ మోసాలపై గతంలో సీపీఐ నారాయణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment