intermediate results released
-
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ -2022 ఫలితాలు వచ్చేశాయ్. బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసి.. మీడియాతో ఫలితాల గురించి మాట్లాడారు. ఫస్టియర్‌లో 2,41,591 మంది పాస్ కాగా, ఫస్టియర్‌లో 54 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. సెకండియర్‌లో 2,58,449 మంది పాస్ కాగా, 61 ఉత్తీర్ణత శాతం రికార్డు అయ్యింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా టాప్‌గా నిలిచిందని, రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వేగంగా, జాగ్రత్తగా పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఉత్తీర్ణతలో బాలురకన్నా బాలికలే ఆధిక్యంలో నిలిచారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విజయవాడలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 10,64,626 మంది (ఫస్టియర్ 5,46,365, సెకండియర్ 5,18,261) ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఫస్టియర్ జనరల్‌లో 59 శాతం, ఒకేషనల్‌లో 41 శాతం, సెకండియర్ జనరల్‌లో 63 శాతం, ఒకేషనల్‌లో 52 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అన్ని కేటగిరీల్లోనూ బాలికలు పైచేయి సాధించారు. జనరల్ కేటగిరీ ఫస్టియర్ పరీక్షలకు 2,57,619 మంది బాలికలు హాజరు కాగా 1,64,365 (64 శాతం), సెకండియర్ పరీక్షలకు 2,22,798 మంది బాలికలు హాజరు కాగా.. 1,49,010 (67 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర విషయానికి వస్తే.. జనరల్ కేటగిరీ ఫస్టియర్ పరీక్షలకు 2,49,611 మంది హాజరు కాగా.. 1,36,195 (55 శాతం), సెకండియర్‌లో 2,12,857 మందికి గాను 1,27,379 (60 శాతం) మంది పాసయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లోనూ 75 శాతం ఉత్తీర్ణత సాధించి కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఫస్టియర్‌లో 65 శాతం, సెకండియర్‌లో 71 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. విశాఖ జిల్లా ఫస్టియర్‌లో 63 శాతం, సెకండియర్‌లో 68 శాతం ఉత్తీర్ణత సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణతా శాతంలో వైఎస్సార్ (ఫస్టియర్ 47 శాతం, సెకండియర్ 52 శాతం), శ్రీకాకుళం (ఫస్టియర్ 51 శాతం, సెకండియర్ 53 శాతం), కర్నూలు (ఫస్టియర్ 51 శాతం, సెకండియర్ 54 శాతం) జిల్లాలు వెనుకబడ్డాయి. -
బయటపడుతున్న గ్లోబరీనా మోసాలు!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థ మోసాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం.. నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేసింది. ఇక గ్లోబరినా ప్రైవేట్ లిమిటెడ్ ఐటి సొల్యూషన్స్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017లో కాకినాడ జేఎన్టీయూలో ఈ సంస్థ మోసాలు బయటపడ్డాయి. కాకినాడ జేఎన్టీయూలో ఈ లెర్నింగ్. ఈ కంటెంట్ టెండర్లలో గ్లోబరీనా మోసాలకు పాల్పడిందని కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రూ.36 కోట్ల ఒప్పందంతో టెండర్ దక్కించుకున్న సంస్థ రూ.26 కోట్ల అవినీతికి పాల్పడిందని జేన్టీయూ కాకినాడ రిజస్టరే స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ మోసాలపై గతంలో సీపీఐ నారాయణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది. -
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.
-
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.1,445 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 10,31,285 మంది హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సర విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయడం ఇదే తొలిసారి అన్నారు. అలాగే ప్రాక్టికల్స్‌లో తొలిసారి జంబ్లింగ్ విధానం అమలు చేశామని, రికార్డు స్థాయిలో కేవలం 24 రోజుల్లో ఫలితాలు విడుదల చేశామన్నారు. మే 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫలితాల్లో కూడా గ్రేడింగ్ విధానం అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి గంటా తెలిపారు. అలాగే 80 శాతం ఉత్తీర్ణతతో ఎప్పటిలాగే బాలికలే పైచేయిగా నిలిచారు. బాలురు 77శాతం ఉత్తీర్ణులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదల ఇంటర్ ఫస్టియర్‌లో 77 శాతంతో కృష్ణాజిల్లా ప్రథమ స్థానం, నెల్లూరు జిల్లా (69 శాతం) ద్వితీయ, పశ్చిమ గోదావరి జిల్లా (67శాతం) తృతీయ స్థానంలో నిలిచాయి. అలాగే ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో 86 శాతంతో కృష్ణాజిల్లా టాప్‌లో నిలవగా, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు సెకండ్ (80శాతం), గుంటూరు జిల్లా (79శాతం) మూడో స్థానంలో నిలిచాయి. ఇక ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా చివరస్థానంలో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్ 20న ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయగా, ఈసారి అంతకన్నా వారం రోజులు ముందుగా విడుదల చేశారు. విద్యార్ధులు తమ పరీక్ష ఫలితాలను ‘సాక్షి, సాక్షి ఎడ్యుకేషన్.కామ్’ www.sakshi.com, www.sakshieducation.com లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఏపీ ఆన్లైన్ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు. ఇంటర్ ఫస్టియర్.... ఫలితాల్లో కృష్ణాజిల్లాకు (77శాతం) మొదటి స్థానం రెండోస్థానంలో నెల్లూరు జిల్లా (69) మూడో స్థానంలో పశ్చిమ గోదావరి (67 శాతం) ఫస్టియర్ లో 64 శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత A-గ్రేడ్- 1,67,194 మంది విద్యార్థులు B-గ్రేడ్ .... 87,346 C-గ్రేడ్... 41,451 D-గ్రేడ్... 18,480 సెకండియర్... కృష్ణాజిల్లా 86 శాతంతో తొలి స్థానం రెండో స్థానంలో నెల్లూరు, చిత్తూరు జిల్లా (80 శాతం) మూడో స్థానంలో గుంటూరు (79 శాతం) రెండో సంవత్సరంలో 77 శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత A-గ్రేడ్- 2,09,248 మంది విద్యార్థులు B-గ్రేడ్ .... 82,530 C-గ్రేడ్... 30,400 D-గ్రేడ్... 8,810 ఎంపీసీలో ఫస్ట్ ర్యాంక్- షేక్ షర్మిల (992 మార్కులు) ఎంపీసీలో సెకండ్ ర్యాంక్- దోసపాటి సాయివంశీ (992) థర్డ్ ర్యాంక్- లోకేశ్ బాబు (991) బైపీసీలో ఫస్ట్ ర్యాంక్ - ఆలపాటి నైమిషా (991) సెకండ్ ర్యాంక్ - పసుపులేటి లీమ (990) థర్డ్ ర్యాంక్ - ఎస్. హారిక (990) సీఈసీలో ఫస్ట్ ర్యాంక్ - యుక్త (969) సెకండ్ ర్యాంక్ - డి పల్లవి (965) థర్డ్ ర్యాంక్ - మహేశ్వరి (965)