కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ | golden telangana comes only with kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ

Published Mon, Jun 23 2014 2:43 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ - Sakshi

కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ

 పెగళ్ళపాడు (ఎర్రుపాలెం): సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ అన్నారు. పెగళ్ళపాడు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వలస పాలనకు వ్యతిరే కంగా జిల్లాలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పెద్దఎత్తున ఉద్యమించిందని అన్నారు. సకల జనుల సమ్మె, బతుకమ్మ, వంటావార్పు తదితర రూపాల్లో ఆందోళనలు సాగాయన్నారు. తెలంగాణ ఉద్యమాల్లో ఖమ్మం జిల్లా ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. రైతుల రుణ మాఫీ విధివిధానాలపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుందన్నారు. సభానంతరం.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
టీఆర్‌ఎస్‌లో చేరిక....
పెగళ్ళపాడు గ్రామ సర్పంచ్ సగ్గుర్తి పుల్లయ్యతోపాటు వివిధ పార్టీలకు చెందిన 20 కుటుంబాలవారు సగ్గుర్తి నరేష్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిని పార్టీ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జి బొమ్మెర రామ్మూర్తి, నాయకులు షేక్ రహీం, సూరంశెట్టి భాస్కరరావు, కర్నాటి శ్రీనివాసరెడ్డి, మొగల్ జానీ భేగ్,  బాలాజీ,  పుప్పాళ్ళ బొల్లయ్య, బత్తిన వీరబాబు, దేవరకొండ హనుమంతరావు, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, షేక్ షమ్మీసాహెబ్, రెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement